Banaras దర్శకుడు సుకుమార్ చేతుల్లో మాయ గంగ.. ప్యాన్ ఇండియా స్థాయిలో బనారస్

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం బనారస్. జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. జ‌య‌తీర్థ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ నిర్మాత‌. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమా నుంచి 'మాయ గంగ' పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతూ.. నిర్మాత తిలక్‌గారి మ‌న‌సు చాలా మంచి మ‌న‌సు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్‌ కోసం మీరు ఓ సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. మంచి ప్ర‌య‌త్నం కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కేకే అందించిన సాహిత్యం బాగుంది. జ‌య‌తీర్థ డైరెక్ట్ చేసిన బెల్ బాట‌మ్ గురించి నేను చాలా విన్నాను. ఆహాలో త‌ప్ప‌కుండా చూస్తాను. అన్నం ఉడికిందా లేదా అని చూడ‌టానికి ఒక మెతుకు ప‌ట్ట‌కుంటే చాలన్నట్లు బెనార‌స్ మూవీ గురించి ఈ మాయ గంగ సాంగ్ చెప్పేస్తుంది. జైద్‌ నాన్న‌గారు క‌ర్ణాటకలో పెద్ద పొలిటీషియ‌న్‌. కానీ సినిమాల‌పై ఆస‌క్తితో జైద్ సినీరంగంలోకి వచ్చాడు. త‌న‌కు విష్ యు ఆల్ ది బెస్ట్‌. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోర‌ుకుంటున్నాను అని అన్నారు.

 Sukumar unveils Banaras movie song Maya Ganga

నిర్మాత తిలరాజ్ బల్లాల్ మాట్లాడుతూ ''మా పాటను రిలీజ్ చేయడానికి సుకుమార్‌గారు రావ‌టం మాకు గ‌ర్వంగా ఉంది. ఇక 'బనారస్' సినిమా గురించి చెప్పాలంటే ముందు హీరో జైద్ ఖాన్ గురించి చెప్పాలి. త‌నకు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్‌. అది నేను గ‌మ‌నించాను. బిజినెస్ చేసుకోమ‌ని తండ్రి చెబుతున్నా.. సినిమా రంగంలోకి ఆస‌క్తిగా వ‌చ్చాడు. త‌న‌ని నేను ముంబైకి తీసుకొచ్చాను. త‌ను డేడికేష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో అన్నివిష‌యాల‌ను తెలుసుకుని సినిమా చేశాడు. పాజిటివ్ వైబ్స్‌తో చేసిన ఈ సినిమాకు అంద‌రూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. పుష్ప సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

చిత్ర దర్శకుడు జయతీర్థ మాట్లాడుతూ ''నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు చేస్తూ పెరిగాను. నేను డైరక్ట్ చేసిన బెల్ బాటమ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆద‌రించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నాను. సినిమాలంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మో నాకు తెలుసు. సినిమాను వారిలా మ‌రెవ‌రూ ప్రేమించ‌లేరు. భాష ఏదైనా మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల్లా ఎవ‌రూ ఆద‌రించ‌లేరు. మా సినిమాను కూడా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ.. మా పాటను విడుదల చేసిన సుకుమార్‌గారికి థాంక్స్‌. తెలుగు సినిమాల‌కు నేను పెద్ద అభిమానిని. హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది. ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరోయిన్ సోనాల్ మోన్‌టైరో మాట్లాడుతూ ''నాకే కాదు.. మా అందరి హృద‌యాల‌కు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే విడుద‌లైన మాయ గంగ అనే పాట సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో రిలీజ్ అవుతుండ‌టం ఎంతో ఉత్సాహంగా ఉంది. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చ‌ుతుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X