Single Kingulam Video Song: ‘A1 ఎక్స్‌ప్రెస్‌’ నుంచి సూపర్ హిట్ సాంగ్ రిలీజ్

అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. హిట్లను మాత్రం అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ నేపథ్యంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత నెలలో 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్ల పరంగా నిరాశనే మిగిల్చింది. ఫలితంగా మొత్తం రికవరీ చేయలేక నష్టాలను ఎదుర్కొంది. దీంతో కేవలం రెండు వారాల్లోనే ఫుల్ రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది.

'A1 ఎక్స్‌ప్రెస్' సినిమాలో 'సింగిల్ కింగులం' అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటకు సామ్రాట్ లిరిక్స్ అందించాడు. ఇక, ఈ సాంగ్‌కు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో తన గ్యాంగ్‌తో కలిసి సందీప్ కిషన్ చేసిన సందడిని చక్కగా చూపించారు. అలాగే, అతడు అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ వీడియో సాంగ్ కూడా లిరికల్ మాదిరిగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

Sundeep Kishans A1 Express Single Kingulam Video Song Released

శుక్రవారం సాయంత్ర విడుదలైన 'సింగిల్ కింగులం' వీడియో సాంగ్‌కు అప్పుడే మూడు లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. అలాగే, లైకులు కూడా బాగానే దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా... ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'A1 ఎక్స్‌ప్రెస్' సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X