Super Singer 2023: శ్రీముఖిని చూస్తే చందమామ కూడా.. కుర్రాడికి అదిరిపోయేలా రాములమ్మ!
ఇంతకాలం స్టార్ మా ఛానెల్ లో బిగ్ బాస్ ఫుల్ గా అలరించింది. ఆ ప్రోగ్రాం అయిపోబోతుంది అన్నప్పటి నుంచే బుల్లితెర ప్రేక్షకులు అంతా తెగ ఫీలైపోతున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ గా ఏం చూడాలా అని. అయితే ఈ విషయం అర్థం చేసుకున్న స్టార్ మా నిర్వాహకులు... అదిరిపోయే ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో వస్తున్న సూపర్ సింగర్ ప్రోగ్రామ్ ను.. ఈ సీజన్ లోనూ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే అద్బుతమైన పాటలతో అంతకు మించి ఫన్ ఇచ్చేందుకు అంతా రెడీ అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే ఈ షోను కూడా ప్రారంబించబోతున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుపుతూనే.. ప్రోమోను కూడా విడుదల చేశారు.
ప్రోమో మొదట్లోనే సూపర్ సింగర్ 2023 యాంకర్ ను చూపించేశారు. అందాల తార, అద్భుతమైన తెలుగు యాంకర్ గా పేరు చెత్తుకున్న ముద్గుగుమ్మ శ్రీముఖియే ఈ ప్రోగ్రాంకు హోస్ట్ గా చేయబోతుంది. అయితే టీం లీడర్లు ఈ సారి ఆస్కార్ అవార్డు విన్నింగ్ సింగర్ కూడా వచ్చాడు. ఇంత గ్రాండ్ గా నిర్వహించబోతున్న షోలో ఎవరెవరు టీం లీడర్లుగా వ్యవహరించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచిన, అద్భుతమైన పాటను పాడి ఆస్కార్ అవార్డు అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఈ ప్రోగ్రాంలో టీం లీడర్ గా ఉండబోతున్నారు. అలాగే ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతూ.. ముఖ్యంగా బతుకమ్మ పాట అంటే ఈమే పాడాలి అన్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న సింగర్ మంగ్లీ కూడా మరో టీం లీడర్ గా వ్యవహరించబోతున్నారు. వీరితో పాటు ఎన్నెన్నో అద్భుతమైన పాటలు రాసిన అనంత శ్రీరామ్ కూడా మరో టీం లీడర్ గా కనిపించనున్నారు. అలాగే నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొని అద్భుతమైన సింగర్ గా పేరు తెచ్చుకున్న మరో సింగర్ శ్వేతా మోహన్ కూడా ఈ ప్రోగ్రాంలో టీం లీడర్ గా దర్శనం ఇవ్వనున్నారు.
ఇంత అద్భుతమైన సింగర్ల కింద ఉండి.. మరెన్నో మంచి మంచి పాటలను పాడేందుకు చాలా 20 మంది కంటెస్టెంట్లు వస్తున్నారు. ఆ 20 మందిలోంచి.. ఈ నలుగురు టీం లీడర్లు ఒక్కొక్కరూ ఐదుగురు చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారంతా ఎంట్రీ ఇస్తూ పాట పాడడం.. తమకు వారు కావాలనుకోగానే టీం లీడర్లు బజర్ నొక్కడం జరుగుతుంది. ఇలా ఎవరికి కావాల్సిన వారిని వారు ఎంచుకుంటారు. ముందుగా టీం లీడర్లు అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. అనంత శ్రీరామ్ అయితే ఆకాశం నుంచి ఊడిపడినట్లు చూపించారు. ఆ తర్వాత శ్రీముఖి దగ్గరకు రాగానే జాకెట్ విప్పారు. అదేంటని అడిగితే.. వింటర్ అని జాకెట్ వేసుకున్నాను.. కానీ నువ్వు పక్కకు వస్తే సమ్మర్ లా అనిపిస్తోందంటూ పంచ్ వేశాడు.
ఆ తర్వాత టీం పేర్లను రివీల్ చేశారు.. అనంత్ వారియర్స్, శ్వేతా రాక్ స్టార్, మంగ్రీ బ్లాస్టర్, రాహుల్ చిచాస్ అంటూ చెప్పేశారు. ఆ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ఓ కంటెస్టెంట్ శ్వేతా మోహన్ కు పొగడ్తల వర్షం కురిరించాడు. వెంటనే శ్రీముఖి వామ్మో ఇది పులిహోర బ్యాచే అనగానే.. మేడం మీరు చాలా అందంగా ఉన్నారని శ్రీముఖికి కూడా ఓ బిస్కెట్ వేసేశాడు. ఆ తర్వాత అతడి వయసు అడిగిన శ్రీముఖి.. పర్వాలేదు నాన్న గారు అడిగితే తమ్ముడివి అని చెప్పేస్తానంటూ బాంబ్ పేల్చింది. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు పాటలు పాడగా.. ఒక్కొక్కరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ప్రోమోనే ఇంత బాగుంది అంటే ఇక షో ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. ఆలోచించడం కాదు శని, ఆది వారాల్లో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











