ఈ రోజు మా నాన్న ఉంటే.. సురేఖ వాణి కూతురు సుప్రియ ఎమోషనల్.. మ్యూజిక్ వీడియో రిలీజ్!

ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత నాయుడు మ్యూజిక్ విడియో ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. తెలుగు సినిమా పరిశ్రమలో సుప్రిత ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అటు సురేఖ వాణి కానీ, సుప్రియ గానీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. కానీ ఆ వార్తలకు తెర దించుతూ మ్యూజిక్ వీడియోలో నటిస్తున్నట్టు సంకేతాలు అందించారు. సుప్రిత నాయుడు నటించిన మ్యూజిక్ వీడియోను ప్రేమికుల రోజున హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుప్రియ నాయుడు గురించి విషయాలు, ఆమె స్పీచ్ గురించిన వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా

నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి నటిగా సురేఖ వాణి పేరు తెచ్చుకొన్నారు. అయితే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సురేఖ వాణి పోస్టు చేసే వీడియోలు, ఫోటోలు ట్రెండింగ్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. తన కూతురుతో దిగిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ఇక తల్లి బాటను అనసరిస్తూ సోషల్ మీడియాలో సుప్రియ చేసే హంగామా చేస్తున్నారు. సుప్రియ టాలెంట్ చూసి అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి.

వెళ్లిపో అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో

వెళ్లిపో అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో

తల్లి సురేఖ వాణి వారసత్వాన్ని పుచ్చుకొన్ని తన కెరీర్‌ను వెళ్లిపో అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో సుప్రిత ప్రారంభించింది. ఊహించని విధంగా అవకాశం రావడంతో మ్యూజిక్ వీడియోలో తన ప్రతిభను చాటుకొన్నారు. సుప్రిత నటించిన మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ సభకు తల్లి సురేఖవాణితోపాటు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాకీ జార్డన్, డైరెక్టర్ నరేష్ అమరనేని , సినిమాటోగ్రాఫర్ రవి, సాయి యశ్వంత్ , శ్యామ్ వాడవల్లి, సుర్య సుబ్రహ్మణ్యం, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు మా ఫాదర్ ఉంటే

ఈ రోజు మా ఫాదర్ ఉంటే


సుప్రిత నాయుడు మాట్లాడుతూ.. వెళ్ళిపో మ్యూజిక్ వీడియో చేసిన తర్వాత నేనేనా ఇది చేసింది అనిపించింది. ఎందుకంటే ఆఫర్ వచ్చినప్పుడు నేను చేయలేను అనే సందేహంతో ఉన్నాను. కానీ నువ్వు చేయగలవు అంటూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి డైరెక్టర్ నరేష్, డీవోపీ రవి నన్ను చాలా అందంగా చూపించారు. ఈ ప్రాజెక్ట్‌తో రాకీ జార్దన్ నాకొక మంచిఫ్రెండ్ అయ్యాడు. ఈ రోజు మా ఫాదర్ వుంటే ఎంతో హ్యాపీగా ఫీలయ్యే వారు అని ఎమోషనల్ అయ్యారు.

ఆఫర్ వస్తే వద్దని అనుకొన్నా..

ఆఫర్ వస్తే వద్దని అనుకొన్నా..

నటి సురేఖ వాణి మాట్లాడుతూ.. వెళ్లిపో ప్రాజెక్ట్‌లో మా అమ్మాయిని భాగస్వామ్యం చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ నరేష్. ఈ ఆఫర్ వచ్చినపుడు మొదట వద్దని అనుకున్నాం. కానీ డైరెక్టర్‌పై నమ్మకంతో ఒకే చెప్పాం. అలాగే సుప్రితతో నేను యాక్టింగ్ చేయించుకోగలనని చెప్పడం, కాన్సెప్ట్ నచ్చడంతో సుప్రీత యాక్ట్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఇంత అందంగా బాగా రావడానికి కారణం నరేష్ హార్డ్ వర్క్ రాకీ బాగా చేశాడు. డీవోపీ రవి ప్రతి ఫ్రేమ్‌ను బాగా చూపించారు అని అన్నారు.

మ్యూజిక్ వీడియో: వెళ్లిపో

మ్యూజిక్ వీడియో: వెళ్లిపో

నిర్మాత: బ్యాచిలర్ కొంప ప్రొడక్షన్స్
కాన్సెప్ట్, డైలాగ్స్, డైరెక్షన్: నరేష్ అమరనేని
నటీనటులు: రాకీ జార్డన్, సుప్రిత నాయుడు
మ్యూజిక్: తేజా కునూరు
సింగర్: రేవంత్
లిరిక్స్: రాకీ జార్డన్
డీవోపీ: రవి బోయిడపు
ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి యశ్వంత్ గల్లా
లైన్ ప్రొడ్యూసర్: సూర్య సుబ్రమణ్యం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X