గత రాత్రే విన్నాడట.. హైప్ పెంచేస్తోన్న సుశాంత్
సుశాంత్ ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చిలసౌ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు. చాలా రోజుల తరువాత సరైన హిట్ కొట్టడంతో సుశాంత్ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. అలా సుశాంత్‌కు మంచి హిట్ లభించడంతో వెంటనే అల వైకుంఠపురములో సినిమాలో చాన్స్ వచ్చింది. అయితే అందులో సెకండ్ హీరో అన్న పేరు మాత్రమే ఉంది.. కానీ పాత్రకు అంతకు ప్రాముఖ్యత, స్కోప్ మాత్రం ఇవ్వలేదు. అలా సోలో హీరోగా సుశాంత్ వచ్చి చాలా గ్యాప్ ఏర్పడింది.
సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే కొత్త కథతో ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడు. ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. బైక్, పార్కింగ్ చుట్టే ఈ సినిమా అంతా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే టీజర్‌లోనే ఎన్నో థ్రిల్లింగ్ అంశాలున్నాయి. తాజాగా సుశాంత్ చేసిన పోస్ట్‌తో మ్యూజిక్ మీద కూడా హైప్ పెంచేస్తోన్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం కాళ భైరవ ఎంతగా ట్రెండింగ్‌లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. కీరవాణి కొడుకుగా కాకుండా.. మంచి సంగీత దర్శకుడు, సింగర్‌గా తన సత్తానుచాటాడు. అయితే అలాంటి కాళ భైరవ తన సినిమా కోసం ఓ పాట పాడాడని, అది గత రాత్రే విన్నానని, అదిరిపోయిందంటూ సుశాంత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఫస్ట్ సింగిల్ కూడా రెడీ అవుతోన్నట్టు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు చెప్పకనే చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











