Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చరిత్ర వెంటాడే సువర్ణసుందరి.. 28న సాహో సార్వభౌమి పాట
తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు. అదే కోవలో నాలుగు జన్మలను మిళితం చేస్తూ రొలర్ కొస్టర్ స్క్రీన్ ప్లేతో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా "సువర్ణ సుందరి " తెరకెక్కుతోంది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి " సాహో సార్వ భౌమి" అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. భవిష్యత్తుని చరిత్ర వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో వచ్చిన "సువర్ణ సుందరి " టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు, సాంకేతికవర్గం:
జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి