సైరా మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే: అఫీషియల్ ప్రొమో రిలీజ్ చేసిన కొణిదెల ప్రొడక్షన్స్

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గతేడాది ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడు ప్రధాన తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో భాగం కావడం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి అంశాలు సినిమాపై మరింత హైప్ పెంచాయి. అయితే పలు కారణాలతో రెహమాన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. కెమెరామెన్ కూడా మారి రత్నవేలు ఫిక్స్ అయ్యాడు.

అయితే సంగీత దర్శకుడు ఎవరు అనే విషయంలో చాలా కాలం పాటు చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తమన్, దేవిశ్రీ, కీరవాణి ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే సైరా టీం ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ఫైనల్ చేస్తూ అఫీషియల్ ప్రోమో విడుదల చేశారు.

ఈ మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో ఉడాన్, వేక్‌ అప్‌ సిద్, ఐషా, దేవ్‌ డి, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, ఇషక్‌ జాదే, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, బాంబే వెల్వెట్‌, ఉడ్తా పంజాబ్‌, క్వీన్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. ఈ ప్రోమోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే టీజర్ ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 Sye Raa Narasimha Reddy: Musical Genius Amit Trivedi promo

ఆదివారం గీత గోవిందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న చిరంజీవి.... తీరిక లేకుండా షూటింగ్ జరుగుతోందని, ఒక్కోసారి రాత్రి 2 గంటల వరకు చిత్రీకరణ చేస్తున్నామని, వందల సంఖ్యలో ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్న విషయం వెల్లడించారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X