హోరెత్తిపోతున్న 'సైరా' నినాదం.. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక విడుదలైతే!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' పైనే ఉంది. మెగా అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం సైరా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సైరా నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ మరింత రక్తి కట్టిస్తోంది. ఈ మేరకు ప్రేక్షకుల ఆతృతను రెక్కలు కట్టేలా 'సైరా' ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తూ
'సైరా నరసింహా రెడ్డి' సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాపై హైప్ పెంచేశాయి. ఇటీవలే విడుదలైన టీజర్, రెండు ట్రైలర్స్ సోషల్ మీడియాను షేక్ చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ మరో సెన్సేషన్‌కి తెరలేపేలా 'ఓ సైరా' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

తమన్నా పర్‌ఫార్‌మెన్స్.. అబ్బురపరిచే విజువల్స్
'ఓ సైరా' వీడియో సాంగ్‌లో తమన్నా పర్‌ఫార్‌మెన్స్ పీక్స్‌లో కనిపిస్తోంది. అబ్బురపరిచే విజువల్స్ నడుమ గుర్రపు స్వారీ చేస్తూ మెగాస్టార్ ఎంట్రీ వావ్ అనిపిస్తోంది. ఇంకా ఈ సాంగ్‌లో చూపించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
'సైరా' నినాదం.. యూట్యూబ్ ట్రెండింగ్
'ఓ సైరా' అంటూ యుద్ధ వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పతనాన్ని తెలుపుతూ సాగిపోతున్న ఈ వీడియో సాంగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఆన్‌లైన్ వేదికలపై మోగిపోతున్న 'సైరా' నినాదం చూస్తుంటే.. ఇక విడుదలయ్యాక ఈ మూవీ సృష్టించే సంచలనాలు ఊహించలేం అంటున్నారు విశ్లేషకులు.

భారీ డిమాండ్.. ఒక్క తెలుగులోనే కాదు!
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. తెలుగుతో పాటు హిందీ వర్షన్ లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో థియేటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. అక్కడ దాదాపు 2000 థియేటర్స్ కేటాయించారని సమాచారం.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











