Devara: బడా సంస్థకు ఎన్టీఆర్ దేవర రైట్స్.. ఏకంగా అన్ని కోట్లతో RRR రికార్డు బ్రేక్
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. అదే సమయంలో ఎంతో మంది హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. RRR తర్వాత అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన అతడు.. ఇప్పుడు 'దేవర' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.

వరుస హిట్లతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. అదే సమయంలో ఈ సినిమా బిజినెస్‌ను కూడా మొదలు పెట్టేశారు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఆడియో రైట్స్‌ను అమ్మేసింది. ఈ హక్కులను బడా సంస్థ టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. 'దేవర' ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్ సంస్థ దాదాపు రూ. 30 కోట్లకు పైగానే మొత్తాన్ని చెల్లించిందట. ఇది సౌత్ ఇండియాలోనే రెండో అత్యధిక డీల్ అని తెలిసింది. ఈ లిస్టులో 'పుష్ప 2' మొదటి స్థానంలో ఉంది. ఇక, దేవర ఆడియోకు ఇంత డిమాండ్ ఉండడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. RRR ఆడియో రైట్స్ రూ. 25 కోట్లు అని తెలిసింది.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











