షేక్ చేస్తున్న తమన్నా భాటియా.. అలాంటి సిరీస్ లను మించిన వీడియో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం జైలర్ తో అలరించింది. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
కొన్నాళ్లుగా తమన్నా భాటియా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కనిపిస్తుంది. తన కెరియర్ సెకండ్ ఇన్ని ప్రారంభించిన సందర్భంగా తమన్నా భాటియా రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల పోటీ పెరగడంతో సీనియర్ హీరోయిన్లకు అవకాశాల విషయంలో కాస్త ఇబ్బందిగానే ఉండింది. కానీ తమన్నా మాత్రం యంగ్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా అవకాశాలు అందుకుంటుంది.

తమన్నా భాటియా తన రెండవ ఇన్నింగ్స్ లోనూ సెన్సేషన్ గా నిలవడానికి కారణం ఆమె స్పెషల్ సాంగ్స్ అని అంటున్నారు. బాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పర్ఫామెన్స్ తో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐటెం సాంగ్స్ తోను దుమ్ము లేపుతోంది. గతంలోనూ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్స్ లో నటించినప్పటికిని ప్రస్తుతం మాత్రం మరింతగా డోస్ పెంచి ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ప్లాన్ ఏ ప్లాన్ బి, లాస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, స్త్రీ2 వంటి చిత్రాల్లో తమన్నా భాటియా పర్ఫామెన్స్ యంగ్ హీరోయిన్లకు మెంటల్ ఎక్కిచ్చేలా ఉంది. ఈ క్రమంలో తాజాగా మరొక సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తమన్నా భాటియా త్వరలో రైడ్ 2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించబోతుంది. అజయ్ దేవగన్, వాణి కపూర్, రితీష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ తో అలరించేందుకు రెడీ అయింది.
రైడ్ 2 నుంచి తమన్నా భాటియా నటించిన స్పెషల్ సాంగ్ నషా వీడియో రిలీజ్ అయింది. గతంలో తన నటించిన స్పెషల్ సాంగ్స్ తో పోలిస్తే మరింత డోస్ పెంచి తమన్న భాటియా మతులు పోగొడుతుంది. బోల్డ్ పర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ చేసిన మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఐటెం సాంగ్ లో మాత్రం కిక్ ఇచ్చే డాన్స్ స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. తమన్నా భాటియా డాన్స్ కు పీయూష్ షాజియా కొరియోగ్రఫీ అందించారు. సచిన్ జిగర్ సంగీతం అందించారు. రైడ్ టు చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక నెక్స్ట్ తమన్నా భాటియా తెలుగులో ఓదెల 2 చిత్రంతో ఎందుకు రెడీ అయింది. ఏప్రిల్ 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను తమన్నా భాటియా జోరుగా నిర్వహిస్తోంది. ఈ చిత్రంలో అఘోరిగా అలరించబోతోంది.


Click it and Unblock the Notifications











