టకీర మోచో... న్యూ స్లోగన్ ఆఫ్ యూత్

భారీ బడ్జెట్ లు, అదిరిపోయే ఫైట్ లు, భారీ లొకేషన్లు, ఫారిన్ సాంగ్ లు వీటన్నింటికీ కాలం చెల్లిపోయిందని తెలిసిందే. కథాకథనాలు బాగుంటే చాలు సినిమా చిన్నదైనా, యాక్టర్లు కొత్తవారైనా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇదే కోవలో ఇటీవలే వచ్చిన రామ్ అసుర్ సినిమా ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రిజల్ట్ అందుకుంది. ఈ సినిమాతో హీరోగానూ, ప్రొడ్యూసర్ గానూ సూపర్ సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

తన స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించిన "మిస్టేక్" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సన్నీ కోమలపాటి దర్శకత్వంలో తెరకెకిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని మొదటి పాట 'గంటా గ్రహచారం' యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. మంగ్లీ, రోల్ రైడా గానం పాటలకు హైలైట్ కాగా, మణి జెన్నా స్వరాలు, శ్రీ శిరాగ్, రోల్ రైడా పదాలు ఈ సాంగ్ ను మరో రేంజ్ కు తీసుకువెళ్లాయనే చెప్పాలి. ఇటీవలే ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

తాజాగా ఇదే సినిమాలో రెండవ పాటను భారీ స్థాయిలో విడుదల చేసింది చిత్ర బృందం. గుంటూరులోని VVIT కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధు నడుమ ఈ పాటను విడుదల చేయగా, కార్యక్రమానికి చిత్రబృందంతో పాటూ విచ్చేసిన సింగర్ రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. "టకీర మోచో" అంటూ సాగే ఈ పాటను విద్యార్ధుల కరతాళధ్వనుల నడుమ విడుదల చేసి సందడి చేశారు. మణిజెన్నా స్వరాలు ప్రేక్షకులను ఓ ఊపుఊపేయగా, కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగింది అనడంలో సందేహమే లేదు.

Taquera Mocho … new slogan of the youth

ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించిన చిత్ర నిర్మాత అభినవ్ సర్దార్, ఇందుకోసం సుమారు 40మంది లిల్లీపుట్స్ ను సేకరించినట్లు తెలిపారు. జంగిల్ థీమ్ తో ఆకట్టుకుంటోన్న ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. సాంగ్ లాంచ్ కార్యక్రమానికి విద్యార్థులే అసలైన గెస్ట్స్ అంటూ సర్దార్ ఇచ్చిన స్పీచ్ కు స్టేడియం ఊగిపోయిందనే చెప్పాలి. అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, సుజిత్ కుమార్, కరిష్మా కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.

ట్రెజర్ హంట్ లో భాగంగా అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్లిన మూడు జంటల చుట్టూ ఈ కథ తిరుగుతుందని అర్ధమవుతోంది. మరి ఆ మూడు జంటలకు చివరకు ట్రెజర్ లభించిందా, ఇందులో భాగంగా వారి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి అన్నదే చిత్ర కథాంశమని తెలుస్తోంది. డైరెక్టర్ సన్నీ కోమలపాటి మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేయనుంది. మరి హీరోగా, ప్రొడ్యూసర్ గా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న అభినవ్ సర్దార్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X