రష్మికని మించేలా.. విజయ్ దేవరకొండతో ప్రియాంక రొమాన్స్.. దూసుకుపోతున్న వీడియో!
Recommended Video

విజయ్ దేవరకొండపై టాలీవుడ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ అంచనాలు పెరుగుతున్నాయి. విభిన్నమైన యాటిట్యూడ్, యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ పెంచుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ చివరగా నటించిన నోటా చిత్రం నిరాశపరిచినా అతడి క్రేజ్ పదిలంగానే ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తం విజయ్ దేవరకొండ వైపు చూసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాక్సీ వాలా చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

ఒకే ఏడాది మూడు చిత్రాలు
ప్రతిష్టాత్మకమైన యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈచిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ 16 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రాహుల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. గీత గోవిందం, నోటా చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. టాక్సీ వాలా చిత్రంతో ఒకే ఏడాది విజయ్ దేవరకొండ నటించిన మూడు చిత్రాలు వచ్చినట్లు అవుతుంది.

రొమాన్స్ హైలైట్
గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రొమాన్స్ మ్యాజిక్ లా పనిచేసింది. యువత అంతా రష్మికకు ఫిదా అయ్యారు. టాక్సీ వాలా చిత్రంలో కూడా యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్, విజయ్ మధ్య కెమిస్టీ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
దూసుకుపోతున్న వీడియో
ఇటీవల టాక్సీ వాలా చిత్ర ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని మాటే వినదుగా అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. గీత గోవిందం చిత్రాన్ని మించేలా విజయ్, ప్రియాంక మధ్య ఈ సాంగ్ లో కెమిస్ట్రీ కుదిరింది.

2020 వరకు బిజీ
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 2020 వరకు తాను పూర్తిగా బిజీ అని ఇటీవల విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నోటా చిత్రం నిరాశపరచడంతో టాక్సీ వాలా చిత్రం విజయం సాధిస్తుందనే ధీమాలో విజయ్ దేవరకొండ ఉన్నాడు.


Click it and Unblock the Notifications











