Telugu Indian Idol 3 Elimination: కుశాల్ శర్మ ఎలిమినేషన్.. థమన్ ఎమోషనల్!

అత్యంత ప్రేక్షకాదరణ, సంగీత అభిమానుల ఆదరణ పొందిన రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 2 తెలుగు. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం రసవత్తరంగా మొదలైంది. జూన్ 14వ తేదీన ప్రారంభమైన ఈ మ్యూజిక్ అండ్ సింగింగ్ షోకు విశేషమైన ఆదరణ లభిస్తున్నది. ఇక ఈ షోలో కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ఎన్నో భావోద్వేగాలకు గురి చేస్తున్నది. తాజాగా ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ చాలా ఎమోషనల్‌గా మారింది. ఆ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..

ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ 3 షోలో తొలి రౌండ్‌లో స్కంద, భరత్ రాజ్, కుశాల్ శర్మ ముగ్గురు ఎలిమినేషన్ రౌండ్‌లోకి వెళ్లారు. జడ్జీలు థమన్, గీతా మాధురి, కార్తీక్ వారికి తక్కువ స్కోర్లు ఇవ్వడంతో వారు డేంజర్ జోన్‌లోకి ప్రవేశించారు. అయితే ఈ షోలో తన ప్రతిభతో ఆకట్టుకొన్న కుశాల్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో కుశాల్‌తో కంటెస్టెంట్లు, న్యాయ నిర్ణేతలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

Telugu Indian Idol 3 Telugu Elimination Kushal Elimination makes SS Thaman Emotional

కుశాల్ విషయానికి వస్తే.. సింగర్ కార్తీక్‌ను స్పూర్తిగా తీసుకొని ఈ షోలొకి వచ్చారు. ఇండియన్ ఐడల్‌లో పాల్గొనడం లైఫ్‌లో ఒక్కసారి వచ్చే అవకాశం. ఈ స్టేజ్ నాకు దేవాలయం లాంటింది అని అన్నారు. ఎలిమినేషన్ తర్వాత మాట్లాడుతూ.. ఈ పోటీ నుంచి చాలా నేర్చుకొన్నాను. మంచి అనుభూతిని, అనుభవాలను పొందాను అని చెప్పుకొన్నాు.

అయితే కుశాల్ ప్రతిభను గుర్తించిన థమన్ కూడా ఎమోషనల్‌గా స్పందిస్తూ.. నిజాయితీతో కూడిన కంటెస్టెంట్. భవిష్యత్‌లో విజయం సాధిస్తాడు. అంతేకాకుండా నీవు నాతో కలిసి లంచ్‌కు రావాలి అని అన్నాడు. అనంతరం థమన్‌, గీతా మాధురి, కార్తీక్‌‌కు కౌశిక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి ఇండియన్ ఐడల్ విషయానికి వస్తే.. శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ప్రసారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X