Singer Sunitha: రెండవ పెళ్లి అనంతరం మళ్ళీ ప్రెగ్నెన్సీ.. కుండబద్దలు కొట్టిన సింగర్ సునీత.. ఏం చెప్పిందంటే?
గాయనిగా ఎన్నో వేల పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ లలో సునీత ఒకరు. ఆమె ఎలాంటి పాట పాడిన కూడా తేన పోసినట్లుగా ఉంటుంది అని ప్రేక్షకులలో ఒక మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. అయితే సింగర్ సునీత పర్సనల్ లైఫ్ విషయంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
అయితే ఆమె రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తల్లి కావడానికి డిసైడ్ అయినట్లుగా కూడా ఈ మధ్య కథనాలు వచ్చాయి. అయితే ఆ విషయంలో సింగర్ సునీత తన వైపు నుంచి అసలైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాలలోకి వెళితే..

గాయనిగా, డబ్బింగ్ ఆర్టీసి గా
ప్రముఖ గాయని సింగర్ సునీత కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా అనేక పాటలు పాడారు. అలాగే హిందీలో కూడా ఆమె అవకాశం వచ్చినప్పుడల్లా తన గాత్రాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పాతికేళ్లుగా సినిమా ప్రపంచంలో ఎన్నో వేల పాటలు పాడిన ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్నారు. చాలావరకు ఎక్కువ సమయాల్లో ప్రముఖ హీరోయిన్స్ కు తెలుగులో ఆమె డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చారు.

రెండవ వివాహం తరువాత..
వినసొంపుగా పాటలు పాడడంతో ఆమె ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును గౌరవాన్ని అందుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్స్ లో కూడా సునీత ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో అయితే సింగర్ సునీత పర్సనల్ లైఫ్ విషయాలపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండవ వివాహం చేసుకున్న తర్వాత కూడా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

భర్తకు సంబంధించిన ఫొటోస్
సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత 2021లో చాలా సింపుల్ గా రామకృష్ణ అనే మీడియా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత తన సెకండ్ మ్యారేజ్ లైఫ్ తో ఆమె చాలా హ్యాపీగా ముందుకు కొనసాగుతున్నారు సోషల్ మీడియాలో కూడా తన భర్తకు సంబంధించిన ఫోటోలను హ్యాపీ మూమెంట్స్ ను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఆమె ప్రెగ్నెంట్ అంటూ..
అయితే ఇటీవల కాలంలో సునీతకు సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది. సింగర్ సునీతకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె మూడోసారి మళ్ళీ తల్లి కాబోతోంది అని ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ తో ఉంది అన్నట్లుగా సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. దాదాపు అది నిజము అనే తరహాలోనే కొన్ని మీడియాలలో కథనాలు కూడా వెలుపడ్డాయి.

కౌంటర్ ఇచ్చేలా సునీత ఆన్సర్
అయితే మొత్తానికి సింగర్ సునీత ఆ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిజంగా నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకు కూడా తెలియదు అంటూ రూమర్స్ పై సెటైర్స్ వేశారు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో వారి ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను అంటూ నా జీవితంలో అలాంటి రూమర్స్ వల్ల ఎలాంటి మార్పు జరగదు అని.. నా పర్సనల్ ప్లేస్ లో నేను హ్యాపీగా ఉన్నాను అని ఆమె వివరణ ఇచ్చారు.

ప్రతిరోజు వాలెంటైన్స్ డే అంటూ..
అలాగే సింగర్ సునీత వాలెంటైన్స్ డే గురించి కూడా చాలా సింపుల్ గా ఒక వివరణ ఇచ్చారు. ఇద్దరు ప్రేమికులు ఇదే రోజున ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమీ లేదు అని ప్రతిరోజు పర్సనల్ లైఫ్ లో చాలా ఆనందంగా ఉంటే సరిపోతుంది అని అన్నారు. అలాగే నేను బిజీగా ఉన్నా కూడా నా భర్తతో రోజుకు కొంత సేపు మాత్రం ప్రత్యేకంగా ట్రైన్ స్పెండ్ చేస్తానని అప్పుడు కూడా మాకు ప్రతిరోజు వాలెంటైన్స్ డే అని ఆమె తెలియజేశారు.


Click it and Unblock the Notifications











