నా ప్రాణం పెట్టి చేశాను.. తమన్ ఎమోషనల్ ట్వీట్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ అవుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన నో పెళ్లి అనే ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. రానా, వరుణ్ తేజ్ వంటి వారి సాయంతో బాగానే ప్రమోట్ చేశాడు. ఇక నో పెళ్లి అనే సిగ్నేచర్ స్టెప్ ఓ రేంజ్‌లో క్లిక్కయింది. ఇక రెండో పాట కోసం వేసిన ఎత్తు అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీని కోసం జనాలను బాగానే పిచ్చోళ్లను చేశారు.

సెకండ్ సింగిల్ కోసం చేపట్టిన ప్రమోషన్స్ భాగానే వైరల్ అయ్యాయి. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి'.. అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. టాలీవుడ్‌ సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూపులోంచి ఈ మధ్యే నిఖిల్, నితిన్, రానావంటి వారు పెళ్లి చేసుకుని అందులోంచి లెఫ్ట్ అయ్యారని, ఇక తాజగా తన వంతు వచ్చిందని ప్ర‌భాస్‌కి సారీ చెబుతూ లెఫ్ట్ అయ్యాడు. అయితే ఈ ప్రకటన తన పెళ్లి గురించేనని కొందరు పప్పులో కాలేశారు.

Thaman About Sai Dharam Tej Solo Brathuke So Better second single

తీరా అది సోలో బ్రతుకే సో బెటర సెకండ్ సింగిల్ కోసమని తెలిశాక అందరూ ముక్కున వేలుసుకున్నారు. ఇక ఈ పాట రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు తమన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రేపటికి అంతా సిద్దమైంది.. ఈ పాటను నా ప్రాణం పెట్టి చేశాను.. సాయి ధరమ్ తేజ్ పట్ల నాకున్న ప్రేమ, నమ్మకానికి ప్రతిబింబంలా ఈ పాట ఉంటుంది. హే ఇది నేనేనా అనే పాట మీ అందరికీ పిచ్చెక్కిస్తుందని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X