‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ సిట్టింగ్స్.. తమన్ ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పరుశురామ్ మహేష్ బాబు కాంబోలో రాబోతోన్న సర్కారు వారి పాట అప్డేట్ వచ్చేసింది. కరోనా రావడంతో షూటింగ్ ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. అయితే ఈ విషయంలో మహేష్ బాబు మాత్రం షూటింగ్‌కు ఇప్పుడే రెడీ అవ్వొద్దన్న సంకేతాలు ఇచ్చాడట. కానీ టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి.
అందరూ తమ తమ చిత్రాల షూటింగ్‌లను ప్రారంభించేశారు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. అయితే మహేష్ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నాడట. అందుకే ముందుగా మ్యూజిక్ సిట్టింగ్స్ కానిద్దామని యూనిట్ భావించిందట. ఈ మేరకు యూనిట్ మొత్తం మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనే బిజీ అయిందట. ఈ మేరకు తమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇప్పటికే సర్కారు వారి పాట మోషన్ పోస్టర్‌లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తమన్ పేర్కొన్నాడు. సర్కారు వారి పాటకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.. ఓ పాటను రికార్డ్ చేస్తున్నామని చెప్పాడు. ఈ మేరకు మహేష్ బాబు, దర్శకుడు పరుశురామ్, మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్‌కు తమన్ థ్యాంక్స్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











