2020లో టాప్ ప్లేస్.. తమన్, అర్మాన్ మాలిక్ హవా మామూలుగా లేదు!

టాలీవుడ్‌లో 2020 ఏడాది మొత్తానికి ఓ ఆల్బమ్‌ను ఎంచుకోమని చిన్న పిల్లాడి ఆప్షన్ ఇచ్చినా సరే అందరూ అల వైకుంఠపురుములో సినిమాకే ఓటు వేస్తారు. ఒక్క పాట రెండు పాటలు అని కాదు.. అన్ని సాంగ్స్ కూడా హైలెట్. ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆ పాటలు మార్మోగిపోతూనే ఉంటాయి. ఒక పాటకు మించి మరొకటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చాయి. సామజవరగమన అనేది సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. దాని తరువాత వచ్చిన పాటలన్నీ కూడా ట్రెండ్ సెట్ చేశాయి.

రాములో రాముల, బుట్టబొమ్మ, ఓమైగాడ్ డాడీ, సిత్తరాల సిరపడు ఇలా ప్రతీ ఒక్క పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా బుట్టబొమ్మ పాట ఖండాలు దాటేసింది. అలా ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పాట మార్మోగుతూనే వచ్చింది టిక్ టాక్ బ్యాన్ కాకపోయింటే ఇంకా బుట్టబొమ్మ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసేది. అలా బుట్టబొమ్మ పాట పాడిన అర్మాన్ మాలిక్ టాలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు ఎన్ని పాటలు పాడినా కూడా రాని పేరు బుట్టబొమ్మతో వచ్చింది.

Thaman And Armaan Malik Most Mentions In 2020 Twitter

తమన్, ఆర్మాన్ మాలిన్ పేర్లు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయట. మ్యూజిక్ కేటగిరిలో అత్యంతగా ఎక్కువగా ట్రెండ్ అయిన లిస్ట్‌లో ఈ ఇద్దరి పేర్లున్నాయట. దేశంలో అయితే ఈ ఇద్దరు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ట్విట్టర్‌లో మెన్షన్ చేసిన సంగీతకారుల్లో తమన్ రెండో స్థానంలో, అర్మాన్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నట్టు ట్విట్టర్ పేర్కొంది. ఈ ఫీట్‌ను అందుకోవడంతో తమన్ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X