భీమ్లా సందడితో మహేష్ సినిమాను గుర్తు చేసిన థమన్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

సంగీత దర్శకుడు థమన్ గత కొంత కాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా మంచి సాంగ్స్ ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాకుండా గతంలో మాదిరిగా అయితే కాఫీ ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొనడం లేదు. వీలైనంత వరకు సరి కొత్తగా కంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనే మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ సందడి లో చాలా బిజీ బిజీగా ఉన్న థమన్ పనిలో పనిగా మహేష్ బాబు సర్కారు వారు పాటను కూడా గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన మంచి అప్డేట్ కూడా ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

పెద్ద సినిమాలతో బిజీగా..

పెద్ద సినిమాలతో బిజీగా..

థమన్ అల..వైకుంఠపురములో సినిమా నుంచి ఇండస్ట్రీలో పెద్ద సినిమాలతో చాలా బిజీగా కనిపిస్తున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో దాదాపు అన్ని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా పెద్ద సినిమా హీరోల సినిమాలకు అయితే థమన్ అదిరిపోయేలా మ్యూజిక్ ఇస్తున్నాడు. వారి ఫ్యాన్ ఫాలోవర్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేస్తున్న మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

తనకు తానే సాటి

తనకు తానే సాటి

ఇక మొత్తానికి వకీల్ సాబ్ సినిమా తర్వాత మరొక సారి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కోసం దద్దరిల్లేలా మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో పాటలు వచ్చినప్పుడు అయితే స్క్రీన్స్ ముందు అభిమానుల నాన్ స్టాప్ గా చిందులు వేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో కూడా తనకు తానే సాటి అని థమన్ మరోసారి నిరూపించుకున్నాడు.

భీమ్లా సందడలో మహేష్ సినిమా అప్డేట్

భీమ్లా సందడలో మహేష్ సినిమా అప్డేట్

ఇక భీమ్లా నాయక్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ విషయంలో కూడా చురుగ్గా కనిపించిన థమన్ ఈ సందడిలోనే మహేష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా లోని మొదటి పాట కళావతి కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

SVP నుంచి మరో సాంగ్

SVP నుంచి మరో సాంగ్

అయితే మరోవైపు భీమ్లా నాయక్ సినిమా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవుతుండగా థమన్ సర్కారు వారి పాట నుంచి మరొక సాంగ్ కూడా త్వరలో రాబోతున్నట్లు అభిమానులకు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. కళావతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని ఇక అదే తరహాలో రెండో పాటను కూడా అందరికీ నచ్చేవిధంగా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. డైరెక్టర్ పరశురామ్ తో దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు.

వచ్చేది ఎప్పుడంటే?

వచ్చేది ఎప్పుడంటే?

సర్కారు వారి పాట సభకు సంబంధించిన రెండవ పాట మార్చి మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందే పాటకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రోమో ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X