సౌండ్‌ను ఎంజాయ్ చేయండి.. ‘V’ స్పెషల్ అంటోన్న తమన్

కొన్ని సినిమాలకు సంగీత దర్శకులు వేరుగా ఉంటారు.. నేపథ్య సంగీత దర్శకులు వేరుగా ఉంటారు. తెలుగులో నేపథ్య సంగీతానికి పెట్టింది పేరు మణిశర్మ, తమన్. ఈ ఇద్దరూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంతో దిట్టా. ప్రత్యేకమైన, భిన్నమైన చిత్రాలను తెరకెక్కించేటప్పుడే నేపథ్య సంగీతం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ వంటి చిత్రాల విషయంలో సౌండ్ ప్రధాన పాత్ర వహిస్తుంది.

V చిత్రంలోనూ నేపథ్య సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌లో సౌండింగ్ వింటేనే అది అర్థమవుతుంది. అయితే V సినిమా పాటలు బాగానే క్లిక్ అయ్యాయి. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందించిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే నేపథ్య సంగీతం విషయంలో మేకర్స్ తమన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు తమన్ న్యాయం చేసినట్టు కనిపిస్తోంది.

 Thaman Background Score For V Movie

సినిమా విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో తమన్ ఓ ట్వీట్ చేశాడు. V బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కోసం ఇదంతా మొదలైంది.. ఇంట్లోనే థియేటర్ ఫీల్ వస్తుంది.. సౌండ్‌ను, సినిమాను ఎంజాయ్ చేయండి. ఇంద్రగంటి అద్భుతమైన సినిమాను అందించాడు. V సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే అవకాశాన్ని అందించిన దిల్ రాజు గారికి థ్యాంక్స్ అంటూ తమన్ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X