‘మగువా’ ఎడిటెడ్ వెర్షన్.. తమన్ ఎమోషనల్ ట్వీట్

ప్రస్తుతం తెలుగు నాట తమన్ పేరు వినిపించినంతగా మరే సంగీత దర్శకుడి పేరు వినిపించడం లేదు. వరుస చిత్రాలు, ఒకదానికొకటి పోలిక లేకుండా అద్భుతమైన బాణీలు, వరుస బ్లాక్ బస్టర్‌లు, మెలోడి అయినా మాస్ బీట్స్ అయినా తమన్ దంచి కొడుతున్నాడు. ప్రతీ పాట సంగీత ప్రియుల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. వెంకీమామ, డిస్కోరాజా, అల వైకుంఠపురములో ఇలా ప్రతీ ఆల్బమ్ అదరొగొట్టేశాడు.

అల వైకుంఠపురములో అయితే ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశాబద్దపు ఆల్బమ్‌ అంటూ అల వైకుంఠపురములో సినిమాను ఆకాశానికెత్తేశారు. యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుని ఇప్పటికీ ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇవన్నీ అలా ముందుక సాగుతూ ఉంటే.. తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేస్తున్నాడు.

Thaman Become Emotional On Netizens Maguva Edited Version

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తోన్న పింక్ రీమేక్ వకీల్ సాబ్‌పై ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. వాటికి తగ్గట్టే.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రాణం పెట్టి చేస్తున్నానని చెప్పిన తమన్..మొదటి సాంగ్‌తోనే అందరినీ కట్టి పడేశాడు. మహిళా దినోత్సవం నాడు విడుదల చేసిన మగువా మగువా సాంగ్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో మహిళ గొప్పదనాన్ని వివరిస్తూ.. ఓ నెటిజన్ ఎడిట్ చేసిన తమన్‌కు ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను చూసిన తమన్ ఎమోషనల్ అవుతూ.. ఎంతో బాగుంది ఈ వీడియో, ఇందులో ఎంతో అర్థం ఉంది.. మీరిచ్చిన కాంప్లిమెంట్స్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X