Pushpa 2: పుష్ప 2 విషయంలో చేతులెత్తేశా..నాతో కాదని తేల్చేశా..తమన్
Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun)- డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప- 2 (Pushpa the Rule). ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించిన మూవీ డిసెంబరు 5న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్, టీజర్స్, లీక్స్ మూవీపై హైప్స్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పుష్ప 2 కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ పంచుకుని .. కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. మూవీపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఇంతకీ పుష్ప 2 గురించి తమన్ ఏమన్నారంటే..
అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్నది. పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్నా ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించారు. అలాగే..ఈ మూవీకి స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ లో బన్నీతో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల మాస్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. దీంతో బన్నీ శ్రీ లీలలు స్టెప్పులు వేస్తుంటే.. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందేననీ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.

'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 The Rule) మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సరిపోలేదని, అతని ప్లేస్‌లో థమన్‌తో పాటు అజనీష్ లోక్‌నాథ్‌ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప సినిమాలో తన పాత్ర గురించి తమన్ వివరించాడు. మాస్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. పుష్ప 2 గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో తమన్ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప 2లో తాను ఒక భాగం మాత్రమేనని, సినిమా మొత్తం బాధ్యతను తీసుకోలేదని తెలిపారు. పుష్ప 2 అనేది చాలా పెద్ద సినిమాని, వ్యాపార పరంగాను ఎన్నో లెక్కలు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని అంశాలను సవాల్ గా తీసుకోవచ్చు అన్నారు. ఇంత పెద్ద సినిమాను కేవలం 15 రోజులలో పూర్తి చేయడం అసాధ్యం, కనుక తాను కొంత పాటు వరకు మాత్రమే పనిచేస్తున్నానని తెలిపారు..
సినిమా గురించి చెబుతూ.. తాను పుష్ప మూవీని మొత్తం చూసానని, చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఇంత పెద్ద సినిమాలో తాను ఒక పార్ట్ మాత్రమే చేయగలిగానని, ఆ విషయంలో డైరెక్టర్లు మూవీ మేకర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారనీ తెలిపారు. ప్రొడ్యూసర్స్ మూవీ మేకర్స్ సపోర్ట్ గా ఉంటేనే పనిచేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నారు.
ఇదెలా ఉంటే. పుష్ప 2 విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. అలాగే.. పుష్ప 2 మూవీ రన్నింగ్ టైం విషయానికి వస్తే.. దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన పలు అప్డేట్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ప్రస్తుతం తమన్ ఇచ్చిన అప్డేట్ కూడా మూవీపై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ రూలింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











