twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్‌సాబ్ సెకండ్ సింగిల్ : కచ్చితంగా గూస్‌బంప్స్.. వారిద్దరి ట్వీట్స్ వైరల్

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడం, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కథతో రావడం, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుడం ఇలా ప్రతీ ఒక్క అంశం వకీల్ సాబ్‌పై అంచనాలు అమాంతం పెంచేశాయి. దీనికి తోడు లీకైన ఫోటోలు, యాక్షన్ సీక్వెన్స్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈ కమ్రంలో తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    అంచనాలు మించేలా..

    అంచనాలు మించేలా..

    పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో భారీగానే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు పవన్ లుక్ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. క్లీన్ షేవ్‌తో బయటకు వస్తున్న పవన్ స్టిల్స్ దుమ్ములేపుతున్నాయి.

    వైరల్‌గా మగువా మగువా..

    వైరల్‌గా మగువా మగువా..

    మహిళా దినోత్సవం సందర్భంగా వకీల్ సాబ్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మగువా మగువా అంటూ రిలీజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాట రాసిన రామజోగయ్య శాస్త్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల గొప్పతనాన్ని అద్బుతంగా వర్ణించారని పొగిడారు.

    రెండో పాట కూడా..

    వకీల్ సాబ్ రెండో పాటకు సంబంధించిన తమన్ ఓ ట్వీట్ చేశాడు. రామజోగయ్య శాస్త్రీ రెండో పాటను కూడా అదరగొట్టాడని ట్వీట్ చేశాడు. ఇలాంటి మంచి పాటలు ఇంకా ఇస్తూనే ఉండాలని అన్నాడు. ఓ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన పాట అని పేర్కొన్నాడు.

    Recommended Video

    Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
    రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారంటీ..

    రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారంటీ..

    తమన్ చేసిన ఈ ట్వీట్‌కు రామజోగయ్య శాస్త్రి రిప్లై ఇస్తూ.. గాడ్ బ్లెస్ యూ డియర్ తమ్ముడు తమన్.. తంపింగ్ సౌండ్‌తో కూడుకున్న రెండో పాటను వినేందుకు నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. పవన్ కళ్యాణ్ గారికి, వేణు శ్రీరామ్ బ్రో, దిల్ రాజు గారికి ధన్యవాదాలు.. గూస్ బంప్స్ కచ్చితం' అంటూ ట్వీట్ చేయగా అది వైరల్ అవుతోంది.

    English summary
    Vakeel Saab Second Single. Thaman Given Update About Vakeel Saab Second Single. This Movie Is Directed By Venu Sri Ram And Produced by Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X