పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే న్యూస్.. అతి త్వరలోనే ఊహించని సర్‌ప్రైజ్
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చిన హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఆయన.. తన రేంజ్‌ను భారీగా పెంచుకుంటున్నారు. దీంతో ఫుల్ జోష్‌తో ప్రాజెక్టులు చేస్తున్నారు.
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వేగంగా సినిమాలు చేస్తోన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ముంబై మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే దీన్ని తీస్తున్నారు.

వైల్డ్ రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటి వరకూ సగం కంటే ఎక్కువ టాకీ పార్టునే పూర్తి చేసేశారు. కానీ, ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో షూట్ ఆగింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు చాలా బ్రేక్ వచ్చింది. దీంతో సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. వాయిదా పడింది. దీనిపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అప్‌డేట్లు ఇచ్చి వాళ్లను మళ్లీ ఖుషీ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా థమన్ దీనిపై అప్‌డేట్ ఇచ్చేశాడు.
సుజిత్ - పవన్ కల్యాణ్ కాంబోలో రాబోతున్న 'OG' సినిమా నుంచి ఊహించని సర్‌ప్రైజ్ రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా తమన్ X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించాడు. ఓ నెటిజన్ అతడిని ఓజీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వమని అడిగాడు. దీనిపై స్పందించిన థమన్ 'త్వరలోనే మిమ్మల్ని కలుస్తాము. నేను సుజిత్ కలిసి ఒకటి రెడీ చేస్తున్నాము' అని చెప్పాడు. దీంతో ఓజీ సర్‌ప్రైజ్ కోసం అందరూ వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











