SSMB28: మహేశ్‌తో విభేదాలు.. సినిమా నుంచి థమన్ ఔట్.. ఊహించని ట్వీట్‌తో క్లారిటీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్నాడతను. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ స్టార్ హీరో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు మరో సినిమాను చేస్తోన్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిలో పడి.. భారీ అంచనాలను ఏర్పరచుకుంది.
'అతడు', 'ఖలేజా' వంటి రెండు క్లాసిక్ మూవీల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఈ మూవీ షూట్‌కు బ్రేకులు వచ్చాయి. అనంతరం రెండో షెడ్యూల్‌ను కూడా మొదలెట్టి చిత్ర యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవలే మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను ఏర్పాటు చేసి ఇందులోనే సినిమా షూటింగ్‌ను జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే, అతడి పనితీరు, వ్యవహార శైలి నచ్చక ఈ సినిమాను తీసేయాలని మహేశ్ బాబు డిసైడ్ అయినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు, దేవీ శ్రీ ప్రసాద్ లేదా అనిరుధ్‌ను తీసుకుంటున్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై థమన్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మే 31న మహేశ్ బాబు మూవీ నుంచి సర్‌ప్రైజ్' అని డ్రమ్స్ ఎమోజీ పెట్టాడు. అంటే.. ఆరోజు సాంగ్ రాబోతుందని పరోక్షంగా చెప్పడంతో పాటు ఈ సినిమాకు తానే పని చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇక, దీనికి 'అయోధ్యలో అర్జునుడు', 'అమ్మ కోసం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











