చిరు కోసం రంగంలోకి బ్రిట్నీ స్పియర్స్.. ట్విస్ట్ ఇచ్చిన తమన్.. అడిగాం కానీ?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాల మనసు పడ్డారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త వెల్లడవుతోంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ , మోహన్లాల్ కీలక పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రను చిరంజీవి నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయం మీద తమన్ ఇచ్చిన లీకులు మాత్రం ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాక కాదు అన్ని భాషల సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో కేవలం ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, కానీ తెలుగు కథకు తగ్గట్టుగా ఈ సినిమా లో నాలుగు నుంచి ఐదు పాటలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారని, తాజాగా వెల్లడైంది.

ఈ విషయం మీద ఓపెన్ అయిన తమన్ ఈ సినిమాలో సంగీతం అనేది చాలా కృషి యల్ పోషిస్తుందని కేవలం తెలుగు ఇతర భాషల వారిని దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ఒక ఇంటర్నేషనల్ ఆల్బమ్ క్రియేట్ చేయడం, ఆల్బమ్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో అందరికీ పరిచయం చేయడం తమ లక్ష్యం అని అన్నారు.

Thaman gives clarity on Britney Spears song in God Father movie

ఒరిజినల్ లూసిఫర్ లో ఒకే ఒక్క పాట ఉండగా, ఈ తెలుగు సినిమాకు నాలుగు పాటలు, శక్తివంతమైన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌లు (OST) మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం (BGM)ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము, "అని ఆయన వెల్లడించారు.

ఇక సల్మాన్ ఖాన్- చిరంజీవి కలిసి ఉన్న సాంగ్ బ్రిట్నీ స్పియర్స్ పాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సల్మాన్‌-చిరు నంబర్‌ పాడేందుకు బ్రిట్నీ స్పియర్స్‌ని సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు. "మేము ఆమెకు ఈ ఆలోచనన చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాము, ఆడియో కంపెనీలు కూడా దానిని పరిశీలిస్తున్నాయనీ అన్నారు. ఆమెతో అగ్రిమెట్ ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మేము కూడా పాటలో ఒక పాత్రలో ఆమె ఉండెలా ప్లాన్ చేస్తున్నాము కానీ ఇప్పుడు దాని గురించి వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని అన్నారు. మొత్తం మీద ఆమెను సంప్రదించడం అయితే జరిగింది. మారి అందుకు ఆమె ఒప్పుకుంటారా? లేదా ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య పూర్తి చేశారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్‌ఫాద‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే భోళా శంక‌ర్ సినిమాను సెట్స్ పైకి వెళతారు అనుకున్నా, ఆ సినిమాకు గ్యాప్ ఇచ్చి మరీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X