Radhe Shyam కోసం రంగంలోకి దిగిన థమన్: రిలీజ్‌కు 20 రోజుల ముందే ఇలా షాకిచ్చారేంటి!
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యమ జోష్‌తో కనిపిస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీని మొదలు పెట్టేశాడు. 'జిల్'తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది.
పూర్తి స్థాయి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి రొమాంటిక్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా ఏళ్లే అవుతోంది. మధ్యలో అనివార్య కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ప్రస్తుతం వాటిపై ఫోకస్ చేశారు. మరీ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం కేటాయించి మరీ మంచి ఔట్‌పుట్ రప్పించేందుకు పాటు పడుతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విడుదలకు మరో ఇరవై రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. తాజాగా యూనిట్ సభ్యులు కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీకి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, హిందీ వెర్షన్ కోసం మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్‌లు పని చేస్తున్నారు. అక్కడ వీళ్లే బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా అందిస్తున్నారు. కానీ, దక్షిణాది భాషల కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపారు. అతడే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్. కొంత కాలంగా బీజీఎంతో రచ్చ లేపుతోన్న అతడిని 'రాధే శ్యామ్' కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది.
'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











