ఇది ఎవ్వరికీ అందని రికార్డ్.. 2020లో తమన్ హవా
తమన్ మ్యూజికల్ సెన్సేషన్ అని చెప్పడానికి ఎన్నెన్నో రికార్డులు కళ్లముందే మెదులుతున్నాయి. ఈ 2020లో సంగీత పరంగా ఏ రికార్డులు చూసినా సరే అవి తమన్ ఒడిలోనే వచ్చిపడుతున్నాయి. యూట్యూబ్ అయితే తమన్ పాటలకు సలాం అంటూ గులామైంది. యూట్యూబ్ ఇండియాలో టాప్ 10 పాటల్లో తమన్ అందించిన సాంగ్సే రెండున్నాయి. అలా ప్రతీ ఒక్క యాప్‌లో తమన్ హవా కొనసాగుతూనే ఉంది.
అల వైకుంఠపురములో, వెంకీమామా, ప్రతీ రోజూ పండుగే, డిస్కోరాజా ఇలా ప్రతీ ఒక్క సినిమాకు ఒక్కో రకమైన సంగీతాన్ని అందించి శ్రోతలను అలరించాడు. ఇక అల వైకుంఠపురములో పాటలు అయితే తమన్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. ఇప్పటికే జియో, సావన్, అమెజాన్ మ్యూజిక్ ఇలా ప్రతీ ఒక్క దాంట్లో తమన్ రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రతీ యాప్‌లో బుట్టుబొమ్మ, రాములో రాముల పాటలు దుమ్ములేపాయి.

తాజాగా గానా యప్‌లోనూ ఏకంగా తమన్ ఎవ్వరికీ అందని రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ ఏడాదిలో ఎక్కువ మంది విన్న పాటలు, ఎక్కువ సార్లు విన్న పాటలు, ఎక్కువ క్షణాల విన్న పాటల్లో తమన్ పేరు మార్మోగిపోయింది. 302 మిలియన్ల సార్లు పాటలను విన్నారు.. 708. 2మిలియన్ల నిమిషాల పాటు తమన్ పాటలను విన్నారట. ఇది కచ్చితంగా ఎవ్వరికీ అందని ఓ అరుదైన ఫీట్. మొత్తానికి తమన్‌కు 2020 బాగానే కలిసివచ్చింది.


Click it and Unblock the Notifications











