BRO: మెగా ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్.. పొరపాటున లీక్ చేసిన థమన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఇప్పుడు స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మాత్రం ఓ రేంజ్‌లో క్రేజ్ ఉందని తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా హీరో వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి 'బ్రో (BRO)' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తోన్న చిత్రమే 'బ్రో (BRO)'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్' అనే చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతూ వస్తోంది. అదే సమయంలో ఈ మూవీ నుంచి వరుసగా అప్‌డేట్లను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'బ్రో (BRO)' మూవీని జూలై 28న రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టీజర్‌ను వదిలారు. దీనికి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం నుంచి పాటలను రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పొరపాటున లీక్ చేశాడు. అతడు తాజాగా చేసిన ట్వీట్‌లో జూలై 3 నుంచి బ్రో మ్యూజిక్ ఫీస్ట్ మొదలు కాబోతుంది అని చెప్పాడు. ఆ వెంటనే 'ప్లీజ్ గాయ్స్.. డేట్‌ను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుంది' అని ట్వీటాడు.

మొత్తానికి జూలై 3వ తేదీన 'బ్రో (BRO)' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది అనేది స్పష్టం అయిపోయింది. అంతేకాదు, కొంత వ్యవధిలోనే ఈ సినిమా నుంచి అన్ని పాటలను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత ట్రైలర్‌ను కూడా వదలబోతున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ మాత్రం జూలై నెలలో పండుగ చేసుకోబోతున్నారు అని చెప్పొచ్చు.
ఇక,'బ్రో (BRO)' మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











