ఆ డైరెక్టర్ కారణంగా ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్నా.. ఏం చేయలేననిపించింది..సీక్రెట్స్ బయట పెట్టిన థమన్
టాలీవుడ్ లో తమన్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. అయితే దాదాపుగా అందరూ స్టార్ హీరోలకు మ్యూజిక్ అందించిన తమన్ ఇప్పటి దాకా మాత్రం ప్రభాస్ కి మ్యూజిక్ అందించలేదు. త్వరలోనే మ్యూజిక్ అందించే అవకాశం ఉంది అని వెల్లడించారు. గతంలో మాత్రం మ్యూజిక్ అందించే అవకాశం వచ్చినా ఆ సినిమా దర్శకుడు కారణంగా పని చేయలేదు అని చెప్పుకొచ్చారు.. వివరాల్లోకి వెళితే

మంచి ఫామ్ లో
థమన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఏ సినిమా చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆయన తాకినదేదైనా బంగారం అవుతుందా అన్నట్టు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ అందరికీ ఫస్ట్ ఛాయిస్ ఆయనే. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి థమన్ ఇంకా సంగీతం అందించలేదు. ఇదే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఖచ్చితంగా జరుగుతుంది
తాను ప్రభాస్ సినిమాకు పనిచేయడం ఖచ్చితంగా జరుగుతుంది అని ఆయన అన్నారు. నేను రెబెల్ సినిమాకి సంగీతం అందించాల్సి ఉంది కానీ నేను సినిమా చేయలేను అని చెప్పి బయటకు వచ్చేసాను అని అన్నారు. దర్శకుడు లారెన్స్ ఆ సినిమాకి నేను సంగీతం అందించాలనీ కోరారని అన్నారు. అయితే నిజానికి లారెన్స్ సంగీతం అందించేస్తాడని అక్కడ నేను చేయడానికి ఏమీ ఉండదు కానీ క్రెడిట్స్ మాత్రం నేనే తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.. అది నచ్చకపోవడంతో నేనే సినిమా చేయలేను అని తప్పుకున్నా అని వెల్లడించారు..

ఫుల్ ఫామ్‌లో ఉన్నా కూడా
అయితే ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తాను ఫుల్ ఫామ్‌లో ఉన్నా కూడా చాలా వినయంగా ఉంటాడని ఆయన చెప్పిన ఒక సమాధానం క్లారిటీ ఇచ్చింది. "మన హీరోలు లేకుండా మనం జీరోలమే అని పేర్కొన్న ఆయన. మన పనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే వారు వాళ్లేనని, వాళ్ళు లేకపోతే మనం అద్భుతమైన పాటలు స్కోర్ చేసినా ఎవరు వింటారు? వాళ్ల వల్లే మనం ఇలా ఉన్నాం'' అని తమన్ హీరోల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

డిసెంబర్ 2న
థమన్ సంగీతం అందించిన, బాలకృష్ణ నటించిన అఖండ డిసెంబర్ 2న విడుదల కానుంది. "ఇప్పటి వరకు నా అత్యుత్తమ ఆల్బమ్ అఖండ అని అది నేను నమ్మకంగా చెప్పగలనని ఆయన అన్నారు. ఈ సినిమా చాలా డిమాండ్ చేసిందన్న ఆయన ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదన్నారు. ఇందులో చాలా సైన్స్ కూడా ఉంది. అఖండ సంగీతాన్ని స్కోర్ చేయడానికి మేము చాలా పరిశోధనలు చేసాము మరియు చాలా పుస్తకాలను చదివాము, "అని తమన్ చెప్పారు.
Recommended Video

చేతి నిండా సినిమాలతో
అంతేగాక అఖండ సినిమా కోసం మేము ఐదు పాటలు సిద్ధం చేశాను కానీ ఫైనల్ గా నాలుగు పాటలు ఉంటాయని ఒక పాటను సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది అని తమన్ వెల్లడించారు. ఇక ప్రస్తుతానికి తమ చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న గోపీచంద్ మలినేని సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











