పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్.. ఏ సినిమాకంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాలకి తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. వీటిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే డీజే టిల్లు ఆల్బం పెద్ద హిట్ అయ్యింది. దీని తర్వాత సర్కారువారిపాట మూవీ కూడా భాగా క్లిక్ అయ్యింది.
అలాగే భీమ్లా నాయక్ మూవీ సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ ని తమన్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అతని చేతిలో పవన్ కళ్యాణ్, సముద్రఖని కాంబినేషన్ లో వస్తోన్న బ్రో మూవీ ఉంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తోన్న చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రాన్ని తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. వీటితో పాటు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న గేమ్ చేంజర్, త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తోన్న చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతోన్న అనగనగా ఒక రాజు మూవీ కూడా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని తమన్ సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా డీలాక్స్ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారంట. రీసెంట్ గా ప్రభాస్ తమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ విని ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ ఆఫర్ అతని చేతికి వచ్చినట్లు టాక్.
ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సినిమా ఫ్లాప్ అయిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజా డీలాక్స్ బ్యాధ్యతలని తమన్ కి ప్రభాస్ అప్పగించినట్లు టాక్. ఈ మూవీ కోసం మొత్తం నాలుగు పాటలని తమన్ సిద్ధం చేసాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











