సర్కారు వారి పాట.. అప్పుడే మొదలెట్టిన థమన్.. త్వరలో స్పెషల్ సాంగ్?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్ తరువాత చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ సరికొత్త లుక్ తో అలరించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ స్పెషల్ లుక్ తో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నాడు.

ఇకపోతే చాలా కాలం తరువాత మహేష్ బాబు థమన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అసలైతే దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమాకు అద్భుతమైన పాటలను అందించిన గోపి సుందర్ ని సెట్ చేసుకుందాం అనుకున్నాడు కానీ మహేష్ పట్టుబట్టి థమన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

Thaman sarkaru vaari pata movie songs work started

అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకమని ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ తొ పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందట. అందుకే మహేష్ థమన్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. గోపిసుందర్ అయితే మహేష్ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వలేరని థమన్ ని ఎంచుకున్నారట.

ఇక ఇప్పటికే థమన్ సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కోసం ఒక ట్యూన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు ట్యూన్స్ కూడా రెడీ చేస్తున్నాడట. దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫుల్ ఆల్బమ్ ని వీలైనంత త్వరగా ఫీనిష్ చేయాలని థమన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X