‘కుర్చి మడతపెట్టి’ తాతకు బంపర్ ఆఫర్.. గుంటూరు కారం సాంగ్ కోసం థమన్ ఏం ఇచ్చాడంటే!

సోషల్ మీడియా వాడకం పెరిగిన ఎన్నో అంశాలు, మాటలు, పాటలు, డైలాగులు మీమ్స్ రూపంలో సెన్సేషన్ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో కనిపించే వాటిని ఇలా వాడుకుంటూ మరింత హైలైట్ చేసేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్‌లో సంచలనం అయిన వాటిని సినిమాల్లో వాడుతున్నారు. అలానే ఇప్పుడు 'గుంటూరు కారం' మూవీలో సాంగ్‌ను రెడీ చేశారు.

కొద్ది రోజుల క్రితం ఓ తాత యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. 'కుర్చీని మడతపెట్టి' అంటూ ఓ స్టోరీని చెప్పిన విషయం తెలిసిందే. ఇది ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయాడు కూడా. అందుకే ఇప్పుడు అదే డైలాగ్‌తో 'గుంటూరు కారం' మూవీలో ఓ సాంగ్‌ను రూపొందించారు.

 Thaman Took Permission From Kurchi Madathapetti Tata for Guntur karam Song

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న 'గుంటూరు కారం' మూవీ నుంచి 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే పాటను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమోను కూడా వదిలింది. ఇందులో మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్‌తో అలరించారు. ఫలితంగా ఈ పాటపై అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా వచ్చిన 'కుర్చీ మడతపెట్టి' ప్రోమోను చూసిన తర్వాత చాలా మంది దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా సాహిత్యం గొప్పగా మాట్లాడిని త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు ఓ బూతు డైలాగుతో పాటను చేయించడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పుడు ఈ పాట టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

 Thaman Took Permission From Kurchi Madathapetti Tata for Guntur karam Song

ఇక, 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్‌ను వాడడానికి దాన్ని చెప్పిన తాత పర్మీషన్ కూడా తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయనకు థమన్ కొంత ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఓ చిత్ర యూనిట్‌తో ఫొటోను తీసి గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి ఒక్క డైలాగ్‌తో స్టార్ అయిన తాత.. ఇప్పుడు ఇలా బంపర్ ఆఫర్ పట్టేశాడన్న మాట.

ఇక, 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X