Sarkaru Vaari Paata బ్యాగ్రౌండ్ లీక్.. హైలైట్ ఇదేనంటూ థమన్ ట్వీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. హ్యాండ్సమ్ లుక్స్‌తోనూ మాయ చేస్తున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆ మధ్య కొన్ని డిజాస్టర్లతో ఇబ్బందులు పడిన మహేశ్ బాబు.. ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తోన్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా.. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రాబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది.

మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. కానీ, ఈ చిత్రం నుంచి ఆ మధ్యన 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే వదిలారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది. దీని తర్వాత ప్రేమికుల రోజును పురస్కరించుకుని గత ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇటీవలే 'పెన్నీ'తో పాటు టైటిల్ సాంగ్‌ను వదిలారు. వీటికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
'సర్కారు వారి పాట'కు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తోన్న ఎస్ థమన్ తరచూ ఈ చిత్రం గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్‌ను లీక్ చేశాడు. ఈ మేరకు తన డబ్బింగ్ స్టూడియోలో దీన్ని ప్లే చేస్తూ ఓ వీడియోను తీసుకున్నాడు. తాజాగా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు, 'ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు సీన్ ఉంటుందీ.. థియేటర్లలో మామూలుగా ఉండదు' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాడు. ఇక, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.
పక్కా కమర్షియల్ జోనర్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబుకు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











