Mahesh Babu ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన థమన్.. ఆ వీడియో షేర్ చేసి మరీ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ హ్యాండ్సమ్ హీరో తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా ఎన్నో విభాగాల్లో రాణిస్తూ హవాను చూపిస్తున్నాడు. అదే సమయంలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తద్వారా తన కెరీర్ గ్రాఫ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.
సక్సెస్‌ల పరంపరతో జోష్ మీదున్న టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల రూపొందిస్తోన్న ఈ మూవీ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రాబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా దాదాపుగా పూర్తైంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. కానీ, ఈ చిత్రం నుంచి ఆ మధ్యన 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే వదిలారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది. దీని తర్వాత ప్రేమికుల రోజును పురస్కరించుకుని గత ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాగే, ఇటీవలే 'పెన్నీ' అనే సాంగ్‌ను కూడా రిలీజ్ చేయగా ఇది కూడా హిట్ అయింది.

కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్.. 'సర్కారు వారి పాట' మూవీ కోసం అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థమన్ ఈ చిత్రం గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో శివమణితో కలిసి డ్రమ్స్ వాయిస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇది పక్కా మాస్ బీట్‌లా ఉంది. దీనికి 'ముంబైలో మా గురువు శివమణి గారితో కలిసి సర్కారు వారి పాట కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా. ఇది మా సెషన్ వీడియో' అని పేర్కొన్నాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు


Click it and Unblock the Notifications











