మహేశ్ అభిమానులకు థమన్ గుడ్ న్యూస్: రచ్చ మొదలైందంటూ ఫొటో షేర్ చేసి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ చాలా కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడతను. అలాగే, ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇక, ఆ మధ్య పలు డిజాస్టర్లతో ఢీలా పడ్డ మహేశ్ బాబు.. ఈ మధ్య కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుస పెట్టి ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

విజయాల పరంపరతో జోష్‌ మీదున్న హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై మొదటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూట్ పూర్తైంది.

Thaman Tweet About Sarkaru Vaari Paata Second Song

మహేశ్ బాబు - పరశురాం కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. కానీ, ఈ చిత్రం నుంచి ఆ మధ్యన 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది. దీని తర్వాత ప్రేమికుల రోజును పురస్కరించుకుని గత ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

'సర్కారు వారి పాట' మూవీలోని 'కళావతి' సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు అందరూ రెండో పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది మార్చి 18న విడుదల కాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దీని గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ యంగ్ సెన్సేషన్ తన ట్విట్టర్ ఖాతాలో తన ఫొటోను షేర్ చేశాడు. దీనికి 'మా కళావతి సాంగ్‌ను సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. రెండో పాటకు సంబంధించిన ప్రిపరేషన్ ఈరోజే మొదలైంది' అని రాసుకొచ్చాడు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని మే 12కు వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X