థమన్ మ్యాజిక్ మామూలుగా లేదు.. ఒకేసారి 10సినిమాలతో బిజీ బిజీగా..

స్టార్ మ్యూజిక్ కంపోజర్ తమన్ 2020లో అల.. వైకుంఠపురములో సినిమాతో బెస్ట్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్ తో పాటు ఆ సినిమా విజయంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. అదే 2020 బెస్ట్ ఆల్బమ్ గా కూడా నిలిచింది. ఈ ఆల్బమ్ అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 1 బిలియన్ వ్యూవ్స్ సాధించింది.

అయితే చిరస్మరణీయ సంవత్సరం తరువాత, తమన్ ఇప్పుడు 10 ప్రాజెక్టులతో 2021కి స్వాగతం పలుకుతున్నాడు. 2020లో టాలీవుడ్ లో అత్యదిక సినిమాలకు కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా థమన్ ఒక క్రేజ్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట, రవి తేజ క్రాక్, బాలయ్య-బోయపాటి BB3, వరుణ్ తేజ్ బాక్సర్ వంటి డిఫరెంట్ హీరోలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Thaman upcoming projects solid hits in 2020

నాని టక్ జగదీశ్ సినిమాతో పాటు తమిళ్ లో అగ్ర హీరోల సినిమాలకు అలాగే కన్నడ లో కూడా రాజ్‌కుమార్ యువరత్న వంటి సినిమాలకు సంగీతం అందించబోతున్నాడు. దాదాపు ఈ ఏడాది 10కి పైగానే సినిమాలతో బిజీ కానున్నాడు ఈ యువ సంగీత సంచలనం. ఇక ఈ బిజీ షెడ్యూల్ చూస్తుంటే రానున్న రోజుల్లో థమన్ కొత్త ప్రాజెక్టులని ఓకే చేయడం కష్టమే అనిపిస్తోంది. ఇక థమన్ మ్యూజిక్ అందించిన క్రాక్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X