అరవింద సమేత నుంచి ఊరమాస్ సాంగ్.. టైమ్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం దసరాకు విడుదలవుతుండడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపొంది ఈ చిత్రం క్రమంగా అంచనాలు పెంచేస్తోంది. టీజర్ లో ఎన్టీఆర్ ని మాస్ లుక్ లో చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తాజాగా విడుదల చేస్తున్న పోస్టర్స్ లో క్లాస్ లుక్ లో చూపిస్తున్నాడు.

ఇప్పటికే చిత్రంలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అనగనగా అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండవ పాటని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది. పెనివిటి అనే ఊర మాస్ సాంగ్ ని బుధవారం సాయంత్రం 4.50 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
లిరికల్ వీడియో రూపంలో ఈ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అరవింద సమేత చిత్రానికి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చినట్లు వార్తలు వస్తుంది. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











