ది సోల్ ఆఫ్ రిషి: ‘మహర్షి’ న్యూ సాంగ్ అద్భుతం.. థియేటర్లో కన్నీళ్లు పెట్టించడం ఖాయం!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి వినసొంపైన ట్యూన్లతో సత్తా చాటారు. అయితే ఇప్పటికే విడుదలైన ఆరు పాటలతో పాటు మరొక పాట కూడా ఉన్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే.
'ది సోల్ ఆఫ్ మహర్షి' పేరుతో ఈ సాంగ్ తాజాగా మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. రిషి అనే వ్యక్తి మహర్షిగా ఎలా మారాడు అనేది వివరిస్తూ శ్రీమణి అందించిన సాహిత్యం ఎంతో గొప్పగా ఉంది. ఈ సాంగ్ రేపు థియేటర్లో కన్నీళ్లు పెట్టించడం ఖాయం.

ఇదే కదా ఇదే కదా నీ కథా.. ముగింపు లేనిదై సదా సాగదా..
నీ కంటి రెప్ప లంచున మనస్సు నిండి పొంగినా..
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద..
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువు ఉందిగా..
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా..
మనుష్యులందు నీ కథా... మహర్షి లాగ సాగదా..
నిస్వార్థమెంత గొప్పదో.. ఈ పథము రుజువు కట్టదా..
సిరాలు లక్ష ఒంపదా చిరాక్షరాలు రాయదా..
నీశీధి ఎంత చిన్నదో.. నీ కంటి చూపు చెప్పదా..
నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా...
మనుష్యులందు నీ కథా... మహర్షి లాగ సాగదా..
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











