Bullet song : పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ది వారియర్ సాంగ్.. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాను. అయితే ఆ సినిమా మాత్రం ఆయన ఊహించినంత సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే కొంత గ్యాప్ తీసుకుని తమిళ మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేశారు. ది వారియర్ పేరుతో తెరకెక్కిన ఆ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. రామ్ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ అధికారిగా కనిపిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు పెంచే విధంగా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లు వంటివి సినిమా మీద ఆసక్తి మరింత పెంచాయి.

ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన బుల్లెట్ బండి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట అటు తెలుగులో, ఇటు తమిళంలో రెండు భాషలలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించి రికార్డులు బద్దలు కొట్టే దిశగా పయనిస్తోంది. ఈ సాంగ్ ను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించడం గమనార్హం. తాజాగా ఈ సాంగ్ ఒక అరుదైన మైలురాయిని దాటేసింది. ఈ సాంగ్ కు తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి నూట పాతిక మిలియన్ వ్యూస్ దాటాయి. ఆ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన విజిల్ అనే సాంగ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంటుంది.

The warrior movies Chartbuster Bullet Song has garnered a record breaking 125 Million Views

ఈ సాంగ్ కూడా మంచి చార్ట్ బస్టర్ అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో రామ్ ఏకంగా విశాఖపట్నం ఏరియా హక్కులు కొనుగోలు చేశాడు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నం ఏరియా కొంచం సేఫ్ కావడంతో పాటు బాగుందని టాక్ వస్తే లాభాలు బాగా వస్తాయని తెలిసి రామ్ ఆ ఏరియా హక్కులు కొనుగోలు చేశారని ప్రచారం మొదలైంది. జూలై నెలలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను సమంత యూటర్న్ సినిమా తెరకెక్కించిన నిర్మాత శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అనే బ్యానర్ మీద నిర్మించారు. రామ్ హీరోగా బోయపాటి శ్రీను చేయబోయే సినిమాని కూడా ఇదే బ్యానర్ మీద ఆయనే నిర్మిస్తున్నారు. మొత్తం మీద రామ్ ది వారియర్ సినిమా మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు. ఈ సినిమా నుంచి విడుదలైన మరిన్ని సాంగ్స్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X