The WARRIORR: ఒక్క సాంగ్‌కే అన్ని కోట్ల ఖర్చు.. రామ్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో!

బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను పెంచుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఆ మధ్య కొన్ని పరాజయాలతో సతమతం అయిన రామ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే అతడు 'రెడ్' అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను యమ జోష్‌తో లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

విజయాల పరంపరతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామితో 'ద వారియర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అంతేకాదు, వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా పూర్తి చేసేశారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి బ్రేకిచ్చారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత దీన్ని మళ్లీ మొదలెట్టారు.

The WARRIORR Spent Rs 3 Crores for Bullet Song

కాప్ స్టోరీతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ద వారియర్' మూవీ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ కాప్‌ గెటప్‌తో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే చాలా మంది బయ్యర్లు పోటీ పడుతున్నారి అంటున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ సినిమా రైట్స్‌ ఇప్పటికే భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు కూడా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

'ద వారియర్' మూవీ నుంచి రెండు రోజుల క్రితమే 'బుల్లెట్' అంటూ సాగే ఓ సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఆలపించిన విషయం తెలిసిందే. దీనికి శ్రీమణి లిరిక్స్ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ పాటకు శ్రోతల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఎన్నో రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ పాట కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ అని అంటున్నారు.

'ద వారియర్' మూవీలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడట. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X