దేవీశ్రీ ప్రసాద్ రేర్ ఫీట్.. 100 రోజుల్లోనే రాక్ స్టార్ సరికొత్త రికార్డు.. ఏంటంటే?

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 25 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ వస్తున్నారు. స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు కూడా చార్ట్ బస్టర్స్ అందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవీ' చిత్రంతో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. తనకు అందిన తొలి అవకాశంతోనే దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 1999లో విడుదలైన ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దేవీ అందించిన సంగీతం కూడా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత నుంచి దేవీశ్రీ ప్రసాద్ వరుస పెట్టి సినిమాలకు సంగీతం అందిస్తూనే వస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలో.. ఆనందం, కలుసుకోవాలని, సొంతం, ఖడ్గం, మన్మధుడు, వర్షం, వెంకీ, ఆర్య శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, నువ్వొస్తానంటే నేనొద్దానంటానా వంటి చిత్రాలకు విజయవంతమైన సంగీతాన్ని అందించారు. దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కు, మెలోడీ ట్రాక్స్ సంగీత ప్రియులు ముగ్ధులయ్యారు. ఆయన వర్క్ చేసిన సినిమాలు, పెట్టిన ఎఫర్ట్ కారణంగా దేవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయనకూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు 150 సినిమాల వరకు సంగీతాన్ని అందించారు. దాదాపు అన్నీ సాంగ్స్ హిట్ కావడం విశేషం.

Tollywood Music Director Devi Sri Prasad Gave Three Top Chartbuster Albums in 100 Days Here is full Details

సంగీత దర్శకుడి దేవీ శ్రీప్రసాద్ ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న దేవీశ్రీ ప్రసాద్ 25 ఏళ్లు ట్రెండ్ సెట్ చేసే సాంగ్స్ ను అందిస్తూనే వస్తున్నారు. కొత్త కొత్త ఇన్స్టిమెంట్స్, ప్రయోగాత్మకంగా సాంగ్స్ ను రూపొందించి ఆకట్టుకుంటున్నారు. మరోవైపు లైవ్ కాన్సర్ట్స్ కూడా నిర్వహిస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును దేవీశ్రీ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. సేమ్ జోనర్ లో వరుసగా సంగీతాన్ని అందించి హిట్స్ అందించిన మ్యూజిక్ట్ డైరెక్ట్స్ ఉన్నారు. కానీ దేవీ డిఫరెంట్ జోనర్స్ లో సంగీతాన్ని అందించడం విశేషంగా మారింది.

దేవీ శ్రీ ప్రసాద్ చివరిగా అక్కినేని నాగచైతన్య 'తండేల్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ఫ2 : ది రూల్', తమిళ స్టార్ సూర్య 'కంగువా' చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ మూడు చిత్రాలకు ఒకదానికొటి సంబంధం లేని జోనర్లు. అన్నీ సంగీతంలో సక్సెస్ సాధించాయి. దేవీ కంపోజ్ చేసిన అదిరిపోయే బీజీఎంలు, సౌండ్ ట్రాక్స్, స్పెషల్ బైట్స్ తో థియేటర్లు దద్దరల్లిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఒకదాని తర్వాత మరొకటి విడుదలై సాంగ్స్ పరంగా దుమ్ములేపాయి.

కేవలం 100 రోజుల్లోనే మూడు డిఫరెంట్ జోనర్స్ లో సంగీతం అందించి.. తండేల్, పుష్ప2, కంగువా చిత్రాల సాంగ్స్ ను టాప్ చార్ట్ బస్టర్స్ గా నిలిపిన ఘనత దేవీశ్రీకి దక్కింది. గతంలో ఓకే ఏడాది ఏడెనిమిది సినిమాలకు వర్క్ చేసి హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా దేవీ మార్క్ సంగీతం రావడం లేదనే రిమార్క్ ఉంది. కొంత ట్రోల్ కూడా జరిగింది కానీ 100రోజుల్లోనే దేవీ వర్క్ చేసిన మూడు చిత్రాలు విడుదలై సంగీత పరంగానూ హిట్ గా నిలవడం హర్షనీయమంటున్నారు. ఇక నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'కుబేరా', 'వృషభ' వంటి చిత్రాలకు వర్క్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devi sri prasad thandel kanguva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X