ఊ.. అంటావా సాంగ్ మీద సింగర్ సంచలన వ్యాఖ్యలు.. అదే వాళ్లను అంటే ఆగుతారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ!
పుష్ప సినిమాలో సమంత 'ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా' సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ పాట మీద ముందు కాపీ మరకలు పడగా ఇప్పుడు ఫెమినిజం అంటూ కొత్త రచ్చ రేగింది. ఈ పాట మీద టాలీవుడ్ వర్ధమాన సింగర్ స్నిగ్ధ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆ వివరాల్లోకి వెళితే.

విపరీతంగా ఆకట్టుకుంటోంది
రీసెంట్ గా రిలీజైన పుష్ప 'ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా' సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కోసం ఈ సాంగ్ రూపొందించారు. సమంత హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సారిగా ఒక ఐటెం సాంగ్ కోసం నట్టించడంతో ఈ సాంగ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అందుకే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ట్రెండింగ్ నెంబర్ 2గా
యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ నెంబర్ 2గా ఈ సాంగ్ దూసుకు పోతుంది. మొదటి ప్లేస్‌ను ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఆక్రమించింది అనుకోండి అది వేరే విషయం. కానీ మూజ్యిక్ ట్రెండింగ్‌లో మాత్రం టాప్ ప్లేసులో ఈ ఐటెం సాంగ్ కొనసాగుతోంది. అసలే సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్.. దానికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా తోడు కావడం, వీటన్నిటికీ కలిపి ప్రెజెంట్ హాట్ టాపిక్ సమంత కూడా ఉండడంతో సినీ ప్రియులయితే ఈ సాంగ్ విని ఒకరకంగా పండుగ చేసుకుంటున్నారు.

మత్తు కలిగించేలా ఉండటంతో
వీటిన్నింటికి తోడు మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ వాయిస్ కూడా మత్తు కలిగించేలా ఉండటంతో అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పాట లిరిక్స్ గురించి ఇప్పుడు పెను చర్చ జరుగుతోంది. పాటలో మీ మగాళ్ళ బుద్ధి వంకర అంటూ కొన్ని లిరిక్స్ ఉండడంతో ఇప్పుడు ఆ లిరిక్స్ మీద రచ్చ జరుగుతోంది. కొందరు సరదాగా ఇదే మాటలను అమ్మాయిలకు అన్వయిస్తూ గనుక అని ఉంటే ఈ పాటికి పెద్ద రచ్చ జరిగి ఉండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

స్నిగ్ధ శర్మ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఇదే విషయం మీద టాలీవుడ్ వర్ధమాన సింగర్ స్నిగ్ధ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. "నేను ఊ అంటావా అంటావా ఉహూ అంటావా అనే పాటను ఎంజాయ్ చేశాను, అనడంలో ఎలాంటి అనుమానం లేదు, కానీ ఒక్కసారి ఊహించుకోండి ఇదే పాటలో గనుక మగవాళ్ళను కాకుండా ఆడవాళ్లను అని ఉంటే ఫేక్ ఫెమినిస్టుల మనోభావాలను దెబ్బ తినేవి అంటూ ఫేక్ ఫెమినిస్టులు మీద ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Recommended Video

జననీ సాంగ్ లో గొంతు కలిపి
స్నిగ్ధ శర్మ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ఆర్ ఆర్ ఆర్ జననీ సాంగ్ లో తన గొంతు కలిపింది. అయితే ఆమె ఈ ఫేక్ ఫెమినిస్టులు అంటూ ఎవరిని టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదు కానీ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది.


Click it and Unblock the Notifications











