TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
గోకించుకుంటేనే డబ్బులు, ఇండస్ట్రీలో ‘గే’లు కూడా ఉన్నారు: సింగర్ సంచలనం
'స్మోకింగ్ కిల్స్ బట్ సిగరెట్ రాక్స్' అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో రాబోతున్న సింగర్ ఫెబా మార్టిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. తాను సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి మ్యూజిక్ మీద ఆసక్తితో సినిమా రంగం వైపు వచ్చానని, సంగతం కంపోజ్ చేయడం, పాటలు రాయడం అంటే చాలా ఇష్టమని తెలిపారు. అయితే ఈ రంగంలోకి వచ్చిన తర్వాత తనకు ఊహించని అనుభవాలు ఎదురైనట్లు తెలిపారు. 'మీటూ' అనుభవాలు చాలా ఫేస్ చేసినట్లు తెలిపారు.
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా..
ఇండస్ట్రీలో కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా ‘మీటూ' అనుభవాలు ఎదురవుతున్నాయి. నాకు చాలా మంది ‘గే' ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో చాలా సెక్యూర్‌గా అనిపిస్తుంది. కానీ స్ట్రైట్ వాళ్లతోనే సమస్యలు ఎదుర్కొన్నాను.
గోకించుకుంటేనే డబ్బులు ఇస్తారు
ఫిజికల్ ఎటాక్ డైరెక్టుగా ఎవరూ చేయరు. గోకేవరకు గోకి వదిలేస్తారు. నువ్వు గోకించుకుంటే నువ్వు చేసిన పనికి క్రెడిట్‌తో పాటు పేమెంట్ కూడా వస్తుంది. లేక పోతే నువ్వు నీ పేమెంట్స్ గురించి జీవితకాలం అడుక్కుంటూ వారి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వాడు మూడొచ్చినపుడు ఇస్తాడు లేక పోతే మరిచిపోవాలి.
నాకు లక్షల్లో రావాల్సి ఉంది
నాకు లక్షల్లో రావాల్సిన పేముంట్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆ డబ్బు వస్తే నేను మంచి ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు అంత పేమెంట్స్ రావాల్సి ఉంది. నేను వారి కోరికలు తీర్చడానికి అంగీకరించలేదు కాబట్టే పేమెంట్స్, క్రెడిట్స్ ఆగిపోయాయి.
నా లాంటి వారిని మిస్ యూజ్ చేసుకునేవారు ఉన్నారు
ఘోస్ట్ కంపోజర్‌గా చాలా సాంగ్స్ చేశాను. ఒకరి పేరు చెబితే ఇంకొకడు హమ్మయ్య నా పేరు చెప్పలేదనుకుంటాడు. అలా ఎంత మందిపేర్లు చెబుతాం. మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు చాలా మంది నా లాంటి వారిని మిస్ యూజ్ చేసుకునేవారు ఉన్నారు. ఒకటి రెండు శాతం రాముడు లాంటి వారు ఉన్నారు. మిగతా వారు రాముడి ముసుగులో రావణుడి లాంటి వారు ఉన్నారు.
ప్యాంట్ వేసుకున్న ప్రతీదీ పడుకోవడానికి వస్తుంది అనే ఫీలింగులో
ప్యాంట్ వేసుకున్న ప్రతీదీ పడుకోవడానికి వస్తుంది అనే ఫీలింగులో చాలా మంది ఉన్నారు. అలాంటి వారి అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. ఒకరిని ఎప్పుడూ పాయింట్ ఔట్ చేయను. ఎందుకంటే మాగ్జిమమ్ అందరూ అలానే ఉన్నారు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఆకలి కొన్ని సార్లు తప్పు చేయిస్తుంది
అమ్మాయిల వైపు తప్పులేకుండా ఉంటుందా? అంటే నేను డిప్లమేటిక్ గా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఉన్న అన్ని దారులు మూసేసి ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన నాకు తిండి లేకుండా చేసినపుడు ఆకలి ఏమైనా చేయిస్తుంది. లక్కీగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండి మీరు వెళితే ఫర్వాలేదు. మంచి ఫ్రెండ్స్ ఉండి ఎలాగో అలా సర్వైవ్ అయితే ఫర్వాలేదు. ఇవి లేకుంటే చాలా కష్టం. చాలా మంది హీరోయిన్ల పర్సనాలిటీ ఉండి కూడా వ్యభిచారంలోకి దిగినవారు జూనియర్ ఆర్టిస్టుల్లో చాలా మంది ఉన్నారు. అన్ని దారులు మూసినపుడు కొంత మందికి తప్పు చేయక తప్పదు.
అన్ని చోట్లా ఉంది, అందుకే ఇండస్ట్రీ హైలెట్ అవుతుంది
ఇది కేవలం ఇండస్ట్రీలో మాత్రమే ఉందని నేను అనడం లేదు. ప్రతి చోటా ఉంది. ఇండస్ట్రీని హైలెట్ చేస్తుంది మీడియా వారే. సెలబ్రిటీ పేరు చెబితే అది త్వరగా జనాలకు రీచ్ అవుతుంది. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు... సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లో కూడా ఉంది. నేను 15 ఏళ్ల క్రితం సాఫ్ట్ వేర్ రంగాన్ని వదిలేశాను. ఇలాంటి ఇబ్బందులు కూడా అక్కడ ఎదురయ్యాయి. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లో ఉన్నపుడు వదిలేశాను. ఈ విషయాలు చెప్పినా ఎవరికీ అర్థం కాదు. ఇండస్ట్రీ వారు టీవీలో కనిపిస్తారు కాబట్టి ఇలాంటివి త్వరగా రీచ్ అవుతాయి.
ప్యాకేజీలో ఉన్న ఆ విషయాలు కూడా ఒప్పుకుంటే...
ఆఫర్ చేసేపుడు ఒక సాంగ్ అనికాకుండా... ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజీలో అన్నీ వస్తాయి. ఆ ప్యాకేజీలో ఉన్న విషయాలకు ఒప్పుకోవడాన్ని బట్టి పేమెంట్ తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది డిసైడ్ అవుతుంది.
స్నేహితులు కూడా మోసం చేశారు
కొన్ని సార్లు ఫ్రెండ్స్ కోసం ఫ్రీగా మ్యూజిక్ చేసినవి ఉన్నాయి. కానీ వారు నన్ను మోసంచేసి నా పేరు వేయని సందర్భాలు అనేకం ఉన్నాయి. నా పేరుతో ప్రొడ్యూసర్ వద్ద లక్షలు తీసుకున్నారు.. అంటూ తనకు ఎదురైన అనుభవాలు సింగర్ ఫెబా మార్టిన్ వెల్లడించారు.