కరోనాతో మంచానపడ్డ స్టార్ సింగర్.. లేవలేని స్థితిలో ఉన్నా, జాగ్రత్త అంటూ పోస్ట్!
తెలుగు సినిమా ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని ఆమె పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే

థర్డ్ వేవ్ వేగంగా
కరోనా థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖులు ఈ సారి కరోనా బారిన పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, లాంటి కరోనా బారిన పడి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి తనకు కరోనా సోకినట్లుగా ట్వీట్ చేయడంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రెటీలు కోరారు.

400లకు పైగా సినిమాల్లో
'నీ కోసం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కౌసల్య ఇప్పటివరకు 400లకు పైగా సినిమాల్లో పాటలు పాడింది. అలా కౌసల్య తెలుగులో చాలా చాలా సూపర్ హిట్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చక్రి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువ పాటలు పాడారు. చక్రి మరణం తరువాత కౌసల్యకు అవకాశాలు తగ్గాయి. అయినా ఆమె స్టేజ్ షోలు చేసుకుంటూ.. అడపాదడపా సినిమాల్లో పాటలు పాడుతున్నారు.

నరకయాతన అనుభవించా
ఆమె గతంలో భర్త పై సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేశాడని కౌసల్య ఆరోపించింది. ఆయన వల్ల తాను నరకయాతన అనుభవించానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సింగర్ గా ఉన్న సమయంలో ఎంతో హాయిగా జీవితాన్ని గడిపిన కౌసల్య వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక కష్టాలు పడినట్టు చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఆమె విడాకులు అయితే జరిగాయి.

బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నా
ఆ తర్వాత చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న ఆమె తనకు కరోనా పాజిటివ్ అని తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, లక్షణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని ఆమె వివరించింది. తనకు రెండు రోజుల నుంచే జ్వరం ఉందని, ప్రస్తుతం కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నానని ఆమె తెలిపింది. దానికి తోడు ఇప్పుడు తనను గొంతు నొప్పి కూడా చాలా ఇబ్బంది పెడుతోందని కౌసల్య సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించింది.

అందరూ జాగ్రత్తగా
కరోనాకు తాను ఒకరోజు ముందు నుంచి మందులు వాడటం మొదలుపెట్టానని కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కరోనా విజృంభిస్తుండడంతో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొంది. ఆమెకు కరోనా అని తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











