సీక్రెట్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్స్
ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. కొందరు చెప్పి చేసుకుంటే.. మరికొందరు మాత్రం చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని.. నెట్టింట్లో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ క్రిష్ సీక్రెట్ గా రెండవ పెళ్లి చేసుకుని.. కూల్ గా పెళ్ళి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ సింగర్స్ కూడా సీక్రెట్ గా లవ్ మార్యేజ్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా ప్రకటించకపోయినా అందరికీ తెలిసిపోయింది. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ సింగర్స్ ఎవరంటే..?
వారు ఎవరో కాదు.. తెలుగు స్టార్ సింగర్ రమ్య బెహరా.. సింగర్ రమ్య బెహరా.. ఈ పేరు తెలియని తెలుగు సంగీత ప్రేమికులు ఉండరు. చిన్న వయసులో నుంచే ఎన్నో మంచి మంచి పాటలను పాడుతూ అభిమానులను సొంతం చేసుకుంది. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి పలు సినిమాల్లోపాటలు పాడింది. రమ్య కేవలం సినిమా పాటలే కాకుండా .. భక్తి గీతాలు కూడా ఆలపిస్తూనే ఉంటుంది. టీవీ సీరియల్ రియాలిటీ హోస్ట్ గా వ్యవహరించి తన సత్తా చాటుకుంటుంది. ప్రస్తుతం జీ తెలుగులో సరిగమప షోలో వన్ ఆఫ్ ది మెంటల్ గా రాణిస్తుంది రమ్య బెహరా .

అయితే రమ్య పెళ్లి చేసుకుందట ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆమె పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. రమ్య పెళ్లి చేసుకుంది కూడా సింగర్ నే. అతని పేరు అనురాగ్ కులకర్ణి. అనురాగ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ అనురాగ్ కులకర్ణి.. కేరాఫ్ కంచరపాలెం సినిమాలో 'ఆశ పాశం' అనే పాట ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 లో పిల్లరా అనే పాట కూడా మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెర సూపర్ సింగర్ 8 విజేతగా కూడా నిలిచారు. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ పుల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అయితే ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవలే వీరిద్దరు కలిసి హే రంగులే సాంగ్ ఆలపించారు. ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.
టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి- రమ్య బెహరా వివాహం శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు, సంహితుల సమక్షంలో వీరు పెళ్లి వేడుక జరిగినట్లు సమాచారం. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తుంది గత కొన్నాళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారని కుటుంబ సభ్యుల అంగీకారంతో నేడు పెళ్లి పీటలు ఎక్కారని నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్.. ఆ సింగర్స్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే రమ్య అనురాగ్ లకు తమ బెస్ట్ ని తెలియజేస్తూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











