RIP KK: సింగర్ మృతిపై మెగాస్టార్, పవర్ స్టార్ ఎమోషనల్.. గుండె బద్దలైంది అంటూ..
ప్రముఖ సింగర్ కేకే మృతిచెందడంతో సంగీత ప్రపంచంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా ప్రపంచంలో అతను మంచి గాయకుడు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఇతర ప్రముఖులతో కూడా అతను ఎంతో స్నేహంగా ఉండే వారు. ఇక అతను పాట పాడితే సినిమా హీరోలు ప్రత్యేకంగా అతన్ని ప్రశంసించేవారు. మెగాస్టార్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ కూడా KK మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కేకే మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. KK దిగ్భ్రాంతికరమైన మరణంతో గుండె పగిలింది అంటూ.. అతను అద్భుతమైన గాయకుడు అని అతని పాటలో గొప్ప సోల్ ఉంటుందని అన్నారు. ఇక నా కోసం 'ఇంద్ర'లోని 'దాయి దాయీ దామా' పాడాడు అంటూ.. అతని కుటుంబానికి అలాగే సన్నిహితులకు ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అని అన్నారు. అలాగే కేకే ఆత్మకు శాంతి కలుగుగాలని ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్
ఇక పవన్ కళ్యాణ్ కూడా KK మృతిపై ఎమోషనల్ గా స్పందించారు. గాయకుడు శ్రీ కె.కె. గారు అకాల మరణం బాధాకరమని కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించిందని అన్నారు. ఇక సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

ఆ పాటలను గుర్తు చేసుకుంటూ
ఇక పవన్ తన చిత్రాల్లో పాడిన పాటలు గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఆ పాటలు సంగీత ప్రియులను మెప్పించాయి అంటూ ఖుషీ చిత్రంలోని 'ఏ మేరా జహా' గీతం అన్ని వయసులవారికీ చేరువైందని.. 'జల్సా'లో మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా', 'బాలు' 'ఇంతే ఇంతింతే', 'జానీ'లో 'నాలో నువ్వొక సగమై', 'గుడుంబా శంకర్'లో 'లే లే లే లే'.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు అని అన్నారు.

నా ప్రగాఢ సానుభూతి
ఆ పాటలు అన్ని కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోవడమే కాదు... సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయని అన్నారు. ఇక సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరమని అంటూ ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారని పవన్ తెలిపారు. ఇక శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

శ్రేయా ఘోషల్ ఎమోషనల్
నేను ఈ వార్తలను నమ్మలేకపొతున్నాను అంటూ.. KK ఎందుకు ఇలా అని తనకి ఏమి అర్థం కావడం లేదని అన్నట్లుగా ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ట్వీట్ చేశారు. అలాగే ఇది అంగీకరించడం చాలా కష్టం అంటూ గుండె ముక్కలు ముక్కలైందని ఆమె అన్నారు. మరో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ కూడా ఎమోషనల్ గా స్పందిస్తూ.. గుండె చెప్పలేనంత పగిలిపోయిందని చాలా త్వరగా వెళ్లిపోయావు సోదార అని అన్నారు. అలాగే మీలాంటి వారు ఎప్పుడూ లేరని, ఎప్పటికీ ఉండరని అను మాలిక్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











