ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. అందరి ఫోకస్ అతని వైపే..?

ఇటీవల కాలంలో మన అగ్రహీరోలు చాలా వరకు సినిమా మార్కెట్ స్థాయిని అంతకంతకూ పెంచుతూనే సరికొత్తగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు అంటేనే ధైర్యంగా అడుగులు వేసే మన అగ్ర హీరోలు ఇప్పుడు మాత్రం ఏదో ఒక ప్రయోగాత్మకమైన కథ ఉంటే గాని ముందుకు వెళ్లడం లేదు. ఇక పాన్ ఇండియా ఫార్మాట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే తరహాలో ముందుకు సాగుతుండడం విశేషం. అంతేకాకుండా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం అంటే అంత సాధారణ విషయం కాదు. ఒకవైపు బాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ లో అగ్ర హీరోలు ఉన్నప్పటికీ కూడా గత రెండు మూడేళ్లలోనే మన స్టార్ హీరోలు వారి కంటే అధిక స్థాయిలో మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.

చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ సినిమా నేషనల్ వైడ్ గా మరింత గౌరవాన్ని అందుకుంటుందని అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక వీరు చేయబోయే సినిమాలలో కొత్తదనంతో పాటు అందులో మ్యూజిక్ కూడా బావుంటేనే మార్కెట్ కు హెల్ప్ అవుతుంది. ఇండియాలో పాన్ ఇండియా సినిమా అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో తప్పకుండా ఒరిజినల్ కంటెంట్ అన్నట్లుగానే విడుదల చేయాల్సి ఉంటుంది. ఇన్ని భాషలో కూడా సినిమాకు సంబంధించిన పాటలు హైప్ క్రియేట్ క్రియేట్ చేయగలిగితేనే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంటుంది.

Tollywood stars special focus on Anirudh Ravichander ,

ఇక మన హీరోలు కూడా కేవలం కంటెంట్ తోనే కాకుండా సంగీత దర్శకులను ఎంచుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ ముగ్గురు కూడా యువ సంగీత సంచలనం అనిరుధ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ మూడు పదుల వయసులో కి రాకముందు ఎన్నో సంచలన విజయాలను అందుకున్నాడు. రజినీకాంత్ నుంచి శివకార్తికేయన్ వరకు ఏ హీరోకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో కూడా తనకి బాగా తెలుసు.సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే సత్తా ఉన్నవాడు.

ఇక త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల లేదా ప్రశాంత్ నీల్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ఇటీవల గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక జెర్సీ కాంబినేషన్ సెట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ అనిరుధ్ తోనే సినిమా చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా అనిరుధ్ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అలాగే లిస్టులో ప్రభాస్ కూడా ఉన్నాడు. చాలాసార్లు ఈ కాంబినేషన్ పై అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు లైన్ లో చాలానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎదో ఒక సినిమాకు ఒకే చెబుతాడాని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X