Rahul Sipligunj: "నాకెవరూ పిల్లనివ్వట్లేదు అదే నా ప్రాబ్లం.. ధ్యాస అంతా దానిమీదే"

రాహుల్ సిప్లిగంజ్... ఈయన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ గా స్పెషల్ వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన ఆ తర్వాత అనేక సినిమాల్లో పాటలు పాడుతూ.. మరింత ఎదిగాడు. ముఖ్యంగా ఇలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లిన ఆయన తాజాగా మాటీవీలో వస్తున్న సూపర్ సింగర్ ప్రోగ్రాంలో జడ్డిగా చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని.. అందుకు గల కారణాలను కూడా వివరిచారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

అద్భుతమైన పాటలు రాస్తూ పాడుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేసే ఈయన.. వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ అందరికీ దగ్గరయ్యాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా వెళ్లాడు. అక్కడ శ్రీముఖితో గొడవ.. పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగించి.. విన్నర్ గా నిలిచాడు. ముఖ్యంగా తన మాటలు, పాటలు, బిహేవియర్, యాటిట్యూడ్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసేశాడు.

Tollywood Top Singer Rahul Sipligunj Shocking Comments About His Marriage Check Details

అయితే బిగ్ బాస్ షోలో పునర్నవి ప్రేమాయణం సాగించిన ఇతడు బయటకు వచ్చిన తర్వాత అషురెడ్డితో క్లోజ్ గా ఉన్నాడు. ఇలా ఒక్కోసారి ఒక్కో అమ్మాయితో కనిపించిన ఈయన... బిగ్ బాస్ తెలుగు 7షోలో వచ్చిన రతికా రోజ్ ను కూడా ప్రేమించాడని టాక్ నడించింది. అయితే పెళ్లి వరకూ వెళ్లిన వీరి ప్రేమ.. మధ్యలోనే క్యాన్సిల్ అయిందని కూడా సమాచారం. అయితే ఈ విషయాలను నేరుగా రతికా రోజ్ యే బిగ్ బాస్ షోలో చెప్పి షాక్ ఇచ్చింది. ఇలా తరచూ వార్తల్లో నిలిచే ఈయన.. సూపర్ సింగర్ షోలో జడ్జిగా చేస్తున్నాడు.

ముఖ్యంగా మంగ్లీతో గొడవ పడుతూ.. శ్రీముఖితో అప్పుడప్పుడూ లవ్ ట్రాక్ నడుపుతూ తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు, ఇటీవల మీపై వస్తున్న వార్తల్లో నిజం ఏదైనా ఉందా అంటూ యాంకర్ అడగ్గా.. షాకింగ్ కామెంట్లు చేశాడు. అవన్నీ ఫేక్ అని చెబుతుండగానే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాబట్టి అందరికీ మీ పెళ్లిపై ఇంట్రెస్ట్ అంటూ యాంకర్ అన్నాడు.

అయితే దీనికి నవ్విన రాహుల్ సిప్లిగంజ్.. నాకెవరూ పిల్లను ఇవ్వట్లేదు.. ఇదే నా ప్రాబ్లం అంటూ చెప్పుకొచ్చాడు. అదంతా విన్న యాంకర్ ఇది నిజమేనా అనగా.. అవును అంటూ తెలిపాడు. ఆ తర్వాత అలా ఏం కాదులే కానీ.. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అంటూ అన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉందని.. తాను కెరియర్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X