Rahul Sipligunz: "నేను ఈమెతోనే ఫిజికల్‌గా ఉంటా.. 40 మంది ముందు హామీ"

టాలీవుడ్ టాప్ సింగర్ గా కొనసాగుతున్న రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్న ఈయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు ఆల్బమ్ వీడియోలు చేస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ షో విన్నర్ గా కూడా నిలిచాడు. ఇలా ఎప్పటికప్పుడు తన టాలెంట్ ను బయటకు తీస్తూ.. అందరినీ మెప్పిస్తున్న ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తనకు పెళ్లిపై ఉన్న ఒపీనియన్ గురించి చెబుతూనే... తన గతంలో జరిగిన అనేక విషయాల గురించి వివరించాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అచ్చమైన హైదరాబాదీ అయిన రాహుల్ సిప్లిగంజ్... అదిరిపోయే జానపద పాటలు రాస్తూ.. వాటిని ఆల్బమ్స్ గా మారుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాట పాడి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక అప్పటి నుంచి అదిరిపోయే పాటలు పాడుతూ.. అందరినీ ఉర్రూతలూగిస్తున్నాడు. ముఖ్యంగా ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో విన్నర్ గా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యాడు.

Tollywood Top Singer Rahul Sipligunz Emotional About His Personal Life Check Details

బిగ్ బాస్ తర్వాత నుంచి ఈయన క్రేజ్ మరింత పెరిగింది. కేవలం పాటలు పాడడమే కాకుండా అనే టీవీ షోలలో కూడా కనిపించాడు. అలాగే నటుడిగానూ మారి పలు సినిమాలు చేశాడు. నాటు నాటు పాట పాడి ఆస్కార్ అవార్డు గెలుచుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈయనపై చాలానే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పునర్నవి భూపాలంతో రిలేషన్ ఉన్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు లేచాయి. బిగ్ బాస్ లో వీళ్లు క్లోజ్ గా ఉండగా అలాంటి వార్తలు రాగా రతికా రోజ్.. రాహుల్ సిప్లిగంజ్ తన మాజీ ప్రియుడు అని చెప్పగా.. మరోసారి ట్రెండింగ్ లోకి వ్చచాడు.

చాలా ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన రాహుల్ సిప్లిగంజ్.. తొలిసారి సింగర్ శ్రావణ భార్గవి చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ముఖ్యంగా శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్లో.. ఫ్లిప్ సైడ్ అనే షో చేస్తుంది. ఇందులో భాగంగానే రాహుల్ ను పిలవగా.. ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా నీ గురించి చెప్పు అనగానే.. ఓ బార్బర్ కుటుంబం నుంచి వచ్చాను.. మానాన్న నన్ను చాలా బాగా పెంచాడని చెబుతాడు. వెంటనే భార్గవి తెలియని చెప్పు అనగా మరిన్ని కొత్త విషయాలను వివరించాడు. నీ లైఫ్ లో ఏదైనా డార్క్ సైడ్ ఉందా అంటే ఉందని చెప్పాడు. చాలా కష్టాలు ఎదుర్కున్నట్లు వివరించాడు.

Tollywood Top Singer Rahul Sipligunz Emotional About His Personal Life Check Details

ముఖ్యంగా అమ్మాయిల టాపిక్ రాగానే చాలా ఫీల్ అయ్యాడు. తాను ఓ బాధ నుంచి బయట పడడానికి చాలా బిజీ అయి, ఎక్కువమంది స్నేహితులను కలుస్తూ.. అసలు క్షణం కూడా తీరిక లేకుండా గడిపినట్లు చెప్పాడు. ఈక్రమంలోనే శ్రావణ భార్గవి పెళ్లికి ముందే చాలా మంది అమ్మాయిలే ఫిజికల్ అవుతున్నారు.. మరి పెళ్లి తర్వాత అంటూ అనగా.. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే నలుగురు, 40 మంది నువ్వు.. నేను ఈ అమ్మాయితోనే ఫిజికల్ గా ఉంటా అని చెప్పి హామీ ఇవ్వడం అని పెళ్లి గురించి కామెంట్లు చేశాడు రాహుల్. దీనికి ఇద్దరూ చాలా నవ్వగా.. ఈ ప్రోమో అయిపోయింది. అయితే రాహుల్ నిజమైన జీవితం, ఆయన ఎదుర్కున్న సమస్యలు తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X