Top 10 Songs of Asha Bhosle: మరుపురాని ఆశా భోంస్లే పాటలు.. లెజెండరీ సింగర్ టాప్ 10 సాంగ్స్ ఇవే..
విశ్వవ్యాప్తంగా, సంగీత ప్రపంచమంతా అభిమానించే, భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగిన గాయని ఆశా భోంస్లే ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె మరణవార్తతో సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. సినీ ప్రముఖులంతా ఆమె మృతివార్తను తెలుసుకొని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ.. భూమ్యాకాశాలు ఉన్నంత కాలం ఆమె పాటలు చిరకాలంగా ఉంటాయంటూ పలువురు ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన జీవితకాలంలో సినీ ప్రేక్షకులను వెంటాడే పాటలు వేలకొలది పాడారు. కానీ అందులో టాప్ 10 సాంగ్స్ వివరాల్లోకి వెళితే..
ఆశా భోంస్లే విషయానికి వస్తే.. 1933 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన సంగ్లీలో జన్మించారు. ఆమెకు స్వర్గీయ గాయని లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్ అక్కాచెల్లెల్లు ఉన్నారు. 1943 సంవత్సరంలో మజా బాల్ అనే మరాఠీ చిత్రంతో ఆమె గాయనిగా కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి చివరి శ్వాస వరకు దాదాపు 8 దశాబ్దాలపాటు గాయనిగా, బిజినెస్ ఉమెన్‌గా, టెలివిజన్ సెలబ్రిటీగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఆశా భోంస్లే గత కొద్దికాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పలు అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా గుండెపోటుతో ఆమె మరణించారు అని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే అధికారికంగా మీడియాకు తెలిపారు. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారతీయ సంగీత ప్రపంచంలో మధురమైన పాటలను శ్రోతలకు అందించారు. ఆమె పాడిన పాటల్లో టాప్ 10 సాంగ్స్ వివరాల్లోకి వెళితే..
1. చురా లియా హై తుమ్నే జో (యాందోకి బరాత్)
సింగర్స్: ఆశా భోంస్లే, మహ్మద్ రఫీ
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: మజ్రూ సుల్తాన్‌పురి
2. యే మేరా దిల్ యార్ కా దీవానా
సింగర్స్: ఆశా భోంస్లే
మ్యూజిక్: కల్యాణ్ జీ ఆనంద్ జీ
సాహిత్యం: ఇండీవార్
3. దమ్ మారో దమ్
సింగర్స్: ఆశా భోంస్లే
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: ఆనంద్ బక్షీ
4. అభి నా జావో చోడ్ కర్ (హమ్ దోనో)
సింగర్స్: ఆశా భోంస్లే, మహ్మద్ రఫీ
మ్యూజిక్: జయదేవ్
సాహిత్యం: సుధీర్ లుధియాన్వీ
5. దో లఫ్జోన్ కీ హై దిల్ కీ కహానీ (ది గ్రేట్ గ్యాంబ్లర్)
సింగర్స్: ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, శరద్ కుమార్
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: మజ్రూ సుల్తాన్‌పురి
6. ఓ హసీనా జుల్ఫోవాలీ (తీస్రీ మంజిల్)
సింగర్స్: ఆశా భోంస్లే, మహ్మద్ రఫీ
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: మజ్రూ సుల్తాన్‌పురి
7. పియా తు అబ్ తో ఆజా (కార్వాన్)
సింగర్స్: ఆశా భోంస్లే, ఆర్డీ బర్మన్
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: మజ్రూ సుల్తాన్‌పురి
8. ఏక్ మై ఔర్ ఏక్ తూ (ఖేల్ ఖేల్ మే)
సింగర్స్: ఆశా భోంస్లే, కిషోర్ కుమార్
మ్యూజిక్: ఆర్డీ బర్మన్
సాహిత్యం: గుల్షన్ భావ్రా
9. ఇన్ ఆంఖోకి కీ మస్తీ (ఉమ్రావ్ జాన్)
సింగర్స్: ఆశా భోంస్లే
మ్యూజిక్: ఖయ్యూమ్
సాహిత్యం: షార్యార్
10. దీవానా హువా బాదల్ (కశ్మీర్ కి కలీ)
సింగర్స్: ఆశా భోంస్లే, మహ్మద్ రఫీ
మ్యూజిక్: ఓపీ నయ్యర్
సాహిత్యం: ఎస్‌హెచ్ బీహారీ
11. జవానీ జానే మన్ (నమక్ హలాల్)
సింగర్స్: ఆశా భోంస్లే
మ్యూజిక్: బప్పీలహరి
సాహిత్యం: అంజాన్
12. నా బోలే తుమ్ నా మైనే (బాతోం బాతోం మే)
సింగర్స్: ఆశా భోంస్లే, అమిత్ కుమార్
మ్యూజిక్: రాజేష్ రోషన్
సాహిత్యం: యోగేష్


Click it and Unblock the Notifications











